NLG: మాల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా: చింతపల్లి మండలం లోని మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నక్క శ్రీను మరియు పాలకవర్గం సభ్యులు గోని జంగయ్య, రామవత్ రమేష్, ఎండి ముషవర్, జమ్ముల వెంకటయ్య, గంట మల్లయ్య, రమావత్ రమేష్, రాగివని అంజాచారి, కందిశెట్టి వెంకటేష్, మారుపాకుల మమత, పూల యాదగిరి, మేకల జగన్ రెడ్డి, ఊర శ్రీనివాస్, లింగంపల్లి వెంకటేష్ ల ప్రమాణ స్వీకారం మహోత్సవం సోమవారం మాల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఏ అవసరం ఉన్న తమ సహాయ సహకారాలు నూతన మార్కెట్ కమిటీకి ఉంటాయని మంత్రి తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రవీందర్ రావు, నాంపల్లి మాజీ జెడ్పిటిసి ఏవి రెడ్డి, మర్రిగూడ మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మర్రిగూడెం మండల పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే యాదగిరి రావు, మర్రిగూడెం మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, చింతపల్లి నాంపల్లి మర్రిగూడ మండలాల ఇతర నాయకులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ:
ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక ఆధ్యాత్మిక విద్యాపరంగా, క్రీడల పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని, భవిష్యత్తులో కూడా మారుమూల గ్రామాల్లో సైతం సామాజిక కార్యక్రమాలను విస్తరిస్తామని, రాష్ట్ర జాతీయ క్రీడలను కూడా నిర్వహిస్తామని మరియు గ్రామీణ ప్రాంత యువతీ, యువకులకు మంచి అవకాశాలను కూడా కల్పిస్తామని రవి ప్రసాద్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం లో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో నల్గొండ జిల్లా ఫుట్బాల్ టీం సెమీఫైనల్ కు చేరిందని చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ ఆదివారం తెలిపారు.
ఈరోజు రెండు మ్యాచ్ లు జరగగా మొదటి మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టుపై ఖాజా అన్వర్ (చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్) సాధించిన ఒక గోల్ తో 1-1 స్కోర్ తో డ్రా చేసుకోగా, 2వ మాచ్ లో ఆదిలాబాద్ పై రాచూరి వెంకటసాయి ( చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్)సాధించిన 3 గోల్స్ తో గ్రూప్ విన్నర్స్ గా సెమీఫైనల్ కు చేరుకున్నదని తెలిపారు.
నల్లగొండ:
ఈ రోజు నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
మునుగోడు: నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయానికి గ్రామాల నుండి సానుకూల స్పందన వస్తోంది. గ్రామాలలో గ్రామస్తుల ఆధ్వర్యంలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేసుకుని, బెల్ట్ షాపులు నిర్వహించకుండా గ్రామస్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభివృద్ధిని నిధులు మంజూరు చేస్తున్నారు.
బెల్ట్ షాపులను నిర్మూలించిన కమిటీ మెంబర్స్ అయిన మహిళల అభిప్రాయాన్ని వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. మీరు తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఎమ్మెల్యేకు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితులలో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తేల్చి చెప్పారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈరోజు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు.
ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలి
నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు.
గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన నాంపల్లి మండల మాజీ ఎంపీపీ దండిగ నాగమణి భర్త దండిగ వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
మునుగోడు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ నియోజకవర్గ కేంద్రంలోని పలు వీధుల్లో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా మునుగోడు బస్ స్టేషన్ సందర్శించారు.
అప్పుడే చౌటుప్పల్ నుండి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మునుగోడు బస్టాండ్ కి రావడంతో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలను పలకరించారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎలా ఉందని కాసేపు ముచ్చటించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ ని అడిగి తెలుసుకున్నారు.
Oct 08 2024, 15:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.3k