NLG: మున్సిపాలిటీగా మారనున్న మునుగోడు!.. ప్రపోజల్స్ ను ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే
మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్ట బోతున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈరోజు మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకేచోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలా వాటికి అవసరమయ్యే స్థలం అన్నింటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండాలి
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలని.. డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు.
నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు.
మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ ను తొందరలోనే తెప్పించుకొని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలనే తన విజన్ ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో శాసనసభ్యుల చిత్తశుద్ధికి మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
Oct 06 2024, 18:16