NLG: మూసి సుందరీకరణ పేరుతో పేదల బ్రతుకులను ఆగం చేయొద్దు: సిపిఎం
నల్లగొండ జిల్లా:
మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులు ఆగం చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కోరారు. గురువారం మునుగోడు లో మండల కమిటీ సమావేశం స్థానిక సిపిఎం కార్యాలయంలో వేముల లింగ స్వామి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నారి ఐలయ్య మాట్లాడుతూ.. మూసి సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పేద, మధ్య తరగతి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని.. మూసి రివర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న ప్రజలపై పోలీసులు అధికారులు దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల మేధావులతో చర్చించాలని.. చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ ప్రజల భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని, పర్యాటక కేంద్రంగా మార్చినంత మాత్రాన ప్రభుత్వ ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. పైగా సాధారణ ప్రజల ఆవాసాలకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మూసి ప్రధాన సమస్య కాలుష్యమని, మందులు రసాయన పరిశ్రమలకు సంబంధించిన వ్యర్ధాలు, మురికి నీరు మూసి లో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతుందని, ఫలితంగా
మూసి పరిసరాల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ఉప్పల్ నుండి సూర్యాపేట వరకు కలుషిత మూసి జలాల వలన వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, చేపలు ఉపయోగించిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల వీధిన పడుతున్న మూసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని, మూసి సుందరీకరణ పేరుతో పేదలను నగరం బయటికి పంపి బడా కార్పొరేట్ సంస్థలకు షాపింగ్ మాల్స్, గార్డెన్స్, స్టార్ హోటల్ యజమానులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని పేదలకు వెంటనే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మూసి ప్రాంత పేదల ఇళ్లను తొలగిస్తారని తెలియడంతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని, మరి కొంతమంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని బాధిత కుటుంబాలను నష్ట పరిహారం ఇవ్వాలని ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, వారిపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, మండల కార్యదర్శి మిర్యాల భగత్, మండల కమిటీ సభ్యులు వరికుప్పుల ముత్యాలు, యాతరాణి శ్రీను, సాగర్ల మల్లేశం, శివర్ల వీరమల్లు, వడ్లమూడి హన్మయ్య, యాట యాదయ్య, కొంక రాజయ్య, బోల్ల ఎట్టయ్య, ఒంటెపాక అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:

నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
నల్గొండ: పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, రేపు జరగబోయే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా.. ఈ రోజు దుర్గ మాత కు పంచామృతాలతో ప్రముఖ అయ్యప్ప పూజల గాయకుడు గురు స్వామి కంజర శ్రీను-జ్యోతి దంపతులు భక్తి శ్రద్ద లతో అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న భవానీ లకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే దేవి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా, పిపిఎల్ రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నల్లగొండ జిల్లా ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్ కన్సల్టెన్సీ డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, వంగూరి భానుప్రసాద్, గ్రామ రైతులు జూలకంటి మాధవరెడ్డి, కట్ట నారాయణరెడ్డి, గోదల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మపాల లింగయ్య, గార్లపాటి ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ: ఈ రోజు జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి, ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, స్వాతంత్య్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు, అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్ర సాధనకు కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Oct 03 2024, 21:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k