NLG: దుర్గామాతకు అభిషేకం నిర్వహించిన కంజర శ్రీను జ్యోతి దంపతులు
నల్గొండ: పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, రేపు జరగబోయే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా.. ఈ రోజు దుర్గ మాత కు పంచామృతాలతో ప్రముఖ అయ్యప్ప పూజల గాయకుడు గురు స్వామి కంజర శ్రీను-జ్యోతి దంపతులు భక్తి శ్రద్ద లతో అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న భవానీ లకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే దేవి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ పూజ కార్యక్రమంలో గురుభవాని వెంకన్న భవాని, మహేష్, మనోజ్, శివ, నవీన్, ప్రవీణ్, వెంకట్, చందు, జగదీష్, అర్జున్, ధత్తు లతో పాటు భవానీలు పాల్గొన్నారు.

నల్గొండ: పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, రేపు జరగబోయే దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా.. ఈ రోజు దుర్గ మాత కు పంచామృతాలతో ప్రముఖ అయ్యప్ప పూజల గాయకుడు గురు స్వామి కంజర శ్రీను-జ్యోతి దంపతులు భక్తి శ్రద్ద లతో అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న భవానీ లకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే దేవి పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా, పిపిఎల్ రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నల్లగొండ జిల్లా ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యం వర్మీ బయో ఆర్గానిక్ కన్సల్టెన్సీ డైరెక్టర్స్ అక్కినపల్లి కిరణ్, వంగూరి భానుప్రసాద్, గ్రామ రైతులు జూలకంటి మాధవరెడ్డి, కట్ట నారాయణరెడ్డి, గోదల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మపాల లింగయ్య, గార్లపాటి ఉషయ్య తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ: ఈ రోజు జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి, ఆల్ ఇండియా బంజారా కార్మిక విభాగం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా, స్వాతంత్య్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు, అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్ర సాధనకు కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నల్గొండ: మున్సిపాలిటీ పరిధిలోని 34 వ వార్డులో వావ్ ప్రాజెక్ట్ వాలంటీర్ నాగుల జ్యోతి మంగళవారం ఇంటింటికి తిరుగుతూ చెత్తను వేరు చేయాలని చెత్తను వేసే బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ ఆర్. పూజిత వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ను వేరు చేయాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని వార్డ్ ప్రజలకు సూచించారు. అనంతరం బ్యాగుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పూజిత వెంకటేశ్వర్లు, వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం చేరాలంటే కష్టపడి చదవాలని, ఈరోజు శ్రమిస్తే రేపు భవిష్యత్ తరాలకు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.
అనంతరం తన దగ్గర లేకున్నా పురోహితం చేసుకుంటూ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం సాయంత్రం తన సొంత డబ్బులతో స్నాక్స్ ను అందిస్తున్న మంచన హరిబాబు ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి ఉపాధ్యాయులు ఎం.మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, జ్యోతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Oct 02 2024, 22:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.4k