NLG: నాగార్జున కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సాంస్కృతిక విభాగం మరియు మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ ఇదొక్కటేనని తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్దలతో కోలుచుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ మన సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు.
కోటొక్క పూల పండుగ బతుకమ్మను ప్రతి యేటా జరుపుకునే తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు.. పిల్లాపాపలతో, పాడి పంటలతో క్షేమంగా ఉండాలని అకాంక్షిoచారు. ఈ సందర్బంగా నిర్వహించిన బతుకమ్మ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడి పాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. సురేష్ బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డా.వి. శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. గంజి భాగ్యలక్ష్మి, అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు, అధ్యాపకులు డా. కిరీటం, డా. ప్రసన్న కుమార్, సుధాకర్, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.
Oct 01 2024, 22:17