NLG: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో సిపిఎం 9వ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభ సూచికగా సిపిఎం నాయకులు నీలకంఠం యాదయ్య సిపిఎం జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనిఆయన అన్నారు. రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ 4 వేల రూపాయలు, వికలాంగులకు 6 వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి నేటికీ సంవత్సరం గడిచిన ఇంతవరకు ఇవ్వలేదని ఆయన అన్నారు.
ఇందుర్తి గ్రామంలో కొంతమందికి రుణమాఫీ అందలేదని వెంటనే అందరికీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ గ్రామంలో మురికి కాలువలు, డ్రైనేజీ, రోడ్లు, అనేక మౌలిక వసతులపై శాఖ మహాసభలో తీర్మానం చేశారని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని 9వ శాఖ మహాసభలో తీర్మానం చేశారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు పెట్టుబడి మీద 50% పెంచి మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేస్తానని మూడు,నాలుగు సంవత్సరాల నుండి రైతాంగాని మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఢిల్లీలో అనేక సందర్భాలుగా పోరాటాలు జరిగినా.. 14 నెలల పాటు దీక్షలు నిర్వహించినా.. నేటి వరకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని అన్నారు.డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం కేటాయించాలని అన్నారు.
సీపీఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, ఏర్పుల దుర్గమ్మ,సిపిఎం నాయకులు గిరి వెంకటయ్య, గడగోటి వెంకన్న, ఏరుకొండ రాఘవేంద్ర,, ఊరు పక్క బిక్షం,జోగు సులోచన, తదితరులు పాల్గొన్నారు.
Sep 30 2024, 20:58