NLG: కామినేని మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం
నల్లగొండ: కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్ పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ మర్రిగూడ అంగన్వాడి సెంటర్లలో పోషణమాస కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా కామినేని జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ కల్నాల్ పివి.రామ మోహన్ పోషకాహార విలువల గురించి, ఇంట్లో వాడుకునే నిత్యావసరాల నుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు. కామినేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు అందించే ఉచిత వైద్య సేవలు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వివరించారు.
కామినేని వైద్య కళాశాల-హాస్పిటల్ క్రింద దత్తత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని సూచించారు. చర్లపల్లి లో ఉన్న కామినేని రూరల్ ఆసుపత్రి లో ఉన్న ఉచిత సేవల వివరాలు తెలిపారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా.మారుతి శర్మ మాట్లాడుతూ.. పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. బాలింతలకు, గర్భిణులకు పోషన్ మాస్ - 2024 కార్యక్రమం గురించి, పోషన్ అభియాన్ కార్యక్రమం సేవల వినియోగం గురించి అవగాహన కల్పించారు.
కౌమార దశ బాలికల కోసం:
1)ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు వినియోగం గురించి అవగాహన కలిగించారు.
2)ఐ.ఎఫ్.ఏ మాత్ర, నులి పురుగుల నివారణకు ఆరు నెలలకి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర వినియోగించాలి అని సూచించారు.
3) ఎల్లపుడు మూత పెట్టిన పాత్రలలో భద్రంగా ఉంచిన నీరునే త్రాగాలి, వంట చేసే ముందు, తినే ముందు ప్రతి సారి తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచించారు.
గర్భిణి స్త్రీలకి:
1) విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, బలోపేతం చేయబడిన పాలు, నూనె మరియు ఐయోడిన్ కలిగిన ఉప్పు వాడుకోవాలని చెప్పారు.
2)నాలుగో నెలలో మొదలుపెట్టి ఆరో నెల వచ్చేవరకు రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
3) ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు గర్భస్థ (ఎ. ఎన్.సి.) పరీక్షలు, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం చేయించుకోవాలని చెప్పారు
పోషణ్ అభియాన్ - పాలిచ్చే తల్లుల కోసం:
1)C విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు, ప్రసవించిన తరువాత ప్రతి రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, డాక్టర్ చెప్పినన్ని కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
2) బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే, బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయిన తరువాత అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు.
మరియు పిల్లలకి, బాలికలకు, బాలింతలకు గర్భిణులకు పండ్లు, ఖర్జూర ప్యాకెట్లు పంచడం జరిగింది.
ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణీలు పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. కామినేని కాలేజీ డాక్టర్లు మా గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చటాన్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డా.ప్రోఫెసర్.కల్నాల్ పి.వి.రామ మోహన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. మారుతి ప్రసాద శర్మ, డా. రత్న బాల రాజు, డా.మొవ్వ దేవ కుమారి. డాక్టర్ అశోక్ దేవ్, డా.యామిని, డా. శ్రీనిజ, ఓం ప్రకాష్, స్వామి, పరశురామ్, సైదులు, బేబీ సరోజ, అంగన్వాడి టీచర్స్ మరియు ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస గౌడ్, సిస్టర్స్ రమణ, అనూష ,స్వాతీ, మేరీ, కళ్యాణి, నాగేంద్ర, మంజుల, హెల్త్ అసిస్టెంట్స్ బద్దం నగేష్, గడ్డం రమేష్, గవర్నమెంట్ కామినేని మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ స్టూడెంట్స్, ఆశ వర్కర్స్ మరియు అటెండర్ సాయి పాల్గొన్నారు.
Sep 29 2024, 12:22