/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: భగత్ సింగ్ పోరాట స్పూర్తి ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి: AIYF జిల్లా అద్యక్షుడు బూడిద సురేష్ Mane Praveen
NLG: భగత్ సింగ్ పోరాట స్పూర్తి ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి: AIYF జిల్లా అద్యక్షుడు బూడిద సురేష్
మర్రిగూడ: AISF మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సీపీఐ మండల కార్యాలయం లో షాహిద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా, సిపిఐ మండల కార్యదర్శి ఈదుల భిక్షం రెడ్డి, AIYF జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్ లు శనివారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. భగత్ సింగ్ పోరాట స్పూర్తి ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ఇస్కిల్ల మహేందర్, సిపిఐ నాయకులు యాదయ్య, ఆకుల రఘుమయ్య, కొన్రెడ్డి గిరి, గీత పని వారల సంఘ నాయకుడు నిరంజన్, హన్మంతు, సాయి, కుమార్ తదితరులు ఉన్నారు.
NLG: కామినేని మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం
  నల్లగొండ: కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్ పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ మర్రిగూడ అంగన్వాడి సెంటర్లలో పోషణమాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా కామినేని జనరల్ హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ కల్నాల్ పివి.రామ మోహన్ పోషకాహార విలువల గురించి, ఇంట్లో వాడుకునే నిత్యావసరాల నుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు. కామినేని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు అందించే ఉచిత వైద్య సేవలు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో వివరించారు. కామినేని వైద్య కళాశాల-హాస్పిటల్ క్రింద దత్తత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని సూచించారు. చర్లపల్లి లో ఉన్న కామినేని రూరల్ ఆసుపత్రి లో ఉన్న ఉచిత సేవల వివరాలు తెలిపారు.

కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా.మారుతి శర్మ మాట్లాడుతూ.. పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. బాలింతలకు, గర్భిణులకు పోషన్ మాస్ - 2024 కార్యక్రమం గురించి, పోషన్ అభియాన్ కార్యక్రమం సేవల వినియోగం గురించి అవగాహన కల్పించారు.

కౌమార దశ బాలికల కోసం:
1)ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు వినియోగం గురించి అవగాహన కలిగించారు.
2)ఐ.ఎఫ్.ఏ మాత్ర, నులి పురుగుల నివారణకు ఆరు నెలలకి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర వినియోగించాలి అని సూచించారు.
3) ఎల్లపుడు మూత పెట్టిన పాత్రలలో భద్రంగా ఉంచిన నీరునే త్రాగాలి, వంట చేసే ముందు, తినే ముందు ప్రతి సారి తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని సూచించారు.

గర్భిణి స్త్రీలకి:
1) విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, బలోపేతం చేయబడిన పాలు, నూనె మరియు ఐయోడిన్ కలిగిన ఉప్పు వాడుకోవాలని చెప్పారు.
2)నాలుగో నెలలో మొదలుపెట్టి ఆరో నెల వచ్చేవరకు రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
3) ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు గర్భస్థ (ఎ. ఎన్.సి.) పరీక్షలు, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం చేయించుకోవాలని చెప్పారు

పోషణ్ అభియాన్ - పాలిచ్చే తల్లుల కోసం:
1)C విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు, ప్రసవించిన తరువాత ప్రతి రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, డాక్టర్ చెప్పినన్ని కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు.
2) బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే, బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయిన తరువాత అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు.
మరియు పిల్లలకి, బాలికలకు, బాలింతలకు గర్భిణులకు పండ్లు, ఖర్జూర ప్యాకెట్లు పంచడం జరిగింది.

ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణీలు పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. కామినేని కాలేజీ డాక్టర్లు మా గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చటాన్ని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో డా.ప్రోఫెసర్.కల్నాల్ పి.వి.రామ మోహన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. మారుతి ప్రసాద శర్మ, డా. రత్న బాల రాజు, డా.మొవ్వ దేవ కుమారి. డాక్టర్ అశోక్ దేవ్, డా.యామిని, డా. శ్రీనిజ, ఓం ప్రకాష్, స్వామి, పరశురామ్, సైదులు, బేబీ సరోజ, అంగన్వాడి టీచర్స్ మరియు ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస గౌడ్, సిస్టర్స్ రమణ, అనూష ,స్వాతీ, మేరీ, కళ్యాణి, నాగేంద్ర, మంజుల, హెల్త్ అసిస్టెంట్స్ బద్దం నగేష్, గడ్డం రమేష్, గవర్నమెంట్ కామినేని మెడికల్ కాలేజీ ఎంబిబిఎస్ స్టూడెంట్స్, ఆశ వర్కర్స్ మరియు అటెండర్ సాయి పాల్గొన్నారు.
NLG: ఎన్ జి కళాశాల విద్యార్థినికి జిల్లా యువజనోత్సవాల్లో ప్రథమ స్థానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో బి.ఏ. తృతీయ సంవత్సరం చదువుతున్న ఎం. నర్మద జిల్లా యువజనోత్సవాల్లో ప్రథమ బహుమతి గెల్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. నర్మద పాడిన “తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట” అనే పాటకు జానపదం సోలో విభాగంలో

ప్రథమ స్థానం లభించిందని తెలిపారు. త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో నర్మద నల్గొండ జిల్లా ప్రతినిధిగా పాల్గొంటుందని తెలిపారు. ఈ సందర్బంగా శనివారం జరిగిన ఒక ప్రత్యేక అభినందన కార్యక్రమంలో నర్మదను ప్రిన్సిపాల్ మరియు కల్చరల్ కో ఆర్డినేటర్ డా. వి. శ్రీధర్ అభినందించారు.

కార్యక్రమంలో మహిళా సాధికారికత విభాగం కన్వీనర్ డా. జి. భాగ్యలక్ష్మి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు మల్లేశం, వెంకట్ రెడ్డి, కోటయ్య, అధ్యాపకులు శివరాణి, సావిత్రి, తెలుగు అధ్యాపకులు డా సైదులు, లింగస్వామి, అంజయ్య, శ్రవణ్ కుమార్ విద్యార్థినిని అభినందిoచారు.
NLG: కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్భంగా శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
TG: భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎంకు ఆహ్వానం
హన్మకొండ జిల్లా శ్రీ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శుక్రవారం దేవస్థానం పాలక మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించింది.

శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,  దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషు భారతి లు సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఆహ్వానం అందజేశారు.
NLG: ఎన్జీ కళాశాలలో ప్రపంచ పర్యాటక  దినోత్సవం
నల్లగొండ: ఈరోజు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ పరంగి రవికుమార్ అధ్యక్షతన యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. చరిత్ర,సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించే అనేక కట్టడాలు, పవిత్రమైన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు, ప్రకృతి సోయగాలతో అలరారే అనేక ప్రదేశాలు నల్లగొండ జిల్లాలో అడుగడుగున కలవని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రదేశాలు కూడా కలవు అన్నారు.

డాక్టర్ పరంగి రవికుమార్ మాట్లాడుతూ.. ఇండియాలో టూరిజంకు విదేశీ మారక నిల్వలను లక్షకోట్ల డాలర్లకు చేర్చాలన్నది కేంద్రం యొక్క లక్ష్యం అని.. ఆ దిశగా కొనసాగాలని, పర్యాటకం మరియు శాంతి లక్ష్యంతో ఆకట్టుకునే బీచ్ లు ఉల్లాసం కలిగించే సముద్ర క్రీడలు, విపరీతమైన వృక్ష జాతులతో పర్యాటకానికే తలమానికంగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న  డా. మునిస్వామి మాట్లాడుతూ.. జి డి పి లో పర్యాటకం రంగం వాటాపెరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఈ పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని యువత రాణించాలని అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా  నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో  ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ మరియు తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగినది.

యువ టూరిజం క్లబ్ కో ఆర్డినేటర్ నర్సింగు కోటయ్య ,పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డా.వి. శ్రీధర్, డా.టంగుటూరు సైదులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది,యువ టూరిజం క్లబ్ స్టూడెంట్ కో ఆర్డినేటర్ బి.సాయితేజ, విద్యార్ది సభ్యులు, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.
లెంకలపల్లి: అంగన్వాడీ కేంద్రం-2 లో పౌష్టిక వారోత్సవాలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం -2 ఆధ్వర్యంలో పౌష్టిక వారోత్సవాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ..  పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్థాల గురించి అంగన్వాడీ లోని  పిల్లల తల్లులకు వివరించి చెప్పారు. ఆశ సైదాబి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
26 పంచాయతీ రాజ్ రోడ్లు మంజూరు.. మరో 27 రోడ్లకు ప్రతిపాదనలు

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడెం, ఘట్టుప్పల్ మండలాల లో మంజూరైన 26 పంచాయతీ రాజ్ రోడ్ల పనులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, ఈ రోజు మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి సీతక్క తో మాట్లాడి రోడ్లు మంజూరు చేయించాలని రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. మరో 27 రోడ్లకు ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తో మాట్లాడి ఈ రోడ్లను మంజూరు చేయించానని రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రమాదపు మూల మలుపు లను తొలగించాలాన్నారు. ఒకసారి రోడ్డు నిర్మాణాలు జరిగితే దానిపై కొన్ని లక్షల కుటుంబాలు ప్రయాణం చేస్తాయని రోడ్ల నిర్మాణము భద్రత గా ఉండాలని అధికారులను కోరారు.

మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు సన్మానం
మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు సన్మానం
నారాయణపురం: మండల విద్యాధికారి గా బాధ్యతలు స్వీకరించిన గోలి శ్రీనివాస్ కు మండల పిఆర్టియు శాఖ తరపున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి, ఉదయ, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి యాదిరెడ్డి, మండల అసోసియేట్ ప్రెసిడెంట్ అంతటి శ్రీనివాసులు, కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళ  ఉపాధ్యక్షులు మమత మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి
స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్దత కలిగిన రాజకీయవేత్త
స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా .. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ Md బాబా షరీఫ్, కొరగొని లింగస్వామి,ఆలే నాగరాజు, బొడిగె బాలకృష్ణ, తాడూరి పరమేష్, కామిశెట్టి భాస్కర్, నాయకులు ఉష్కాగుల, రమేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.