/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz చత్రపతి శివాజీ స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని సందర్శించిన బొమ్మపాల గిరిబాబు Mane Praveen
చత్రపతి శివాజీ స్ఫూర్తి స్మారక కేంద్రాన్ని సందర్శించిన బొమ్మపాల గిరిబాబు
శ్రీశైలం పుణ్యక్షేత్రం లోని చత్రపతి శివాజీ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని ఈరోజు నల్గొండ చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్ఫూర్తి కేంద్రంలో శివాజీ రాజ్యంలోని  మంత్రివర్గం సహచరుల విగ్రహాలు మరియు చత్రపతి శివాజీ విగ్రహం ఎంతో తేజస్సుతో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుందని తెలిపారు.

ప్రతి ఒక్క యువకుడు చత్రపతి లోని దేశభక్తిని నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు.
NLG:జ్యోతి బాపూలే స్థాపించిన సత్య శోదక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కై ఉద్యమిద్దాం: సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ
మహాత్మా జ్యోతి బా పూలే స్థాపించిన సత్య శోదక్ సమాజ్  152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ కేవలం భారతదేశం లోనే ఉందన్నారు. 77 సం.రాల అధికార మార్పిడి తర్వాత కూడా దేశంలో కుల అణిచివేత, అంటరానితనం, కుల హత్యలు జరగడం సిగ్గుచేటు అన్నారు.

కులం అనే రక్కసి మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ వివక్ష, అంటరానితనం, హత్యాకాండ, అత్యాచారాలకు  గురి చేస్తుందన్నారు. ఒకపక్క దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మతం పేరుతో మనిషిని మనిషే చంపుతున్న దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుత సమాజం నెలకొంది అన్నారు.

కుల వ్యవస్థకు క్రీస్తుపూర్వం 3,500 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. అది నేడు రాజకీయ నాయకులకు ఓట్లు దండుకునేందుకు ఆయుధమైందన్నారు. దేశంలో లక్షకు పైగా కులాలు, ఉప కులాలు ఉన్నాయని మధ్యయుగాల కాలంలోనే కుల వివక్షత వ్యతిరేకంగా వేమన, తుకారం, కబీర్, నానక్ తోపాటు ఎన్నో సంస్కరణోద్యమాలు జరిగాయన్నారు.

ప్రస్తుత పాలక బూర్జువా పార్టీలు కుల, మతాల మధ్య తమ చిచ్చు పెట్టి తమ రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని, అధికారాన్ని సాదించుకునేందుకు కులాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, PYL జిల్లా కార్యదర్శి బి.వి చారి, PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్, రావుల వీరేశ్, కత్తుల లింగుస్వామి, దశరథ, తీగల సురేష్,తీగల నరేష్, శంకర్
తదితరులు పాల్గొన్నారు.
NLG: బాల్య వివాహాలు నిషేధం - అవగాహన సదస్సు
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఇవాళ విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాలు నిషేధం, బాల కార్మిక వ్యవస్థ, బాలల అపరహణ మరియు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, స్వీయ రక్షణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఆర్గనైజర్ పి.ధనమ్మ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
TG: వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన.. ప్రజలు, కార్యకర్తల తో మంత్రుల ముఖాముఖి

ప్రజా పాలన -ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  ఫోకస్

సరికొత్త సంప్రదాయానికి నాంది  పలికిన నేతలు

HYD: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత  పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా నిరంతరం కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటున్నారు.

అలాగే వారితో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇప్పటి నుండి వారానికి రెండు రోజులు బుధ, శుక్రవారం కాంగ్రెస్ పార్టీ  గాంధీభవన్ ఆఫీస్ లో ఒక్కోరోజు ఒక మంత్రి అందుబాటులో ఉంటారు.

ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 02.00 గంటలకు రోజుకు 3 గంటలు, అందుబాటులో ఉంటారు. అది రానున్న  బుధవారం నుండి  ప్రారంభించనున్నారు.

ఇక వారానికి రెండు రోజుల పాటు గాంధీ భవన్ కు మంత్రుల సందర్శన

ప్రజలు, కార్యకర్తల తో మంత్రుల ముఖాముఖి ..

సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు చర్చించుకుని గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ను ఖరారు చేశారు.

ఈ బుధవారం నుండే ప్రారంభం.. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.

తొలి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ.. ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి.

ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి గాంధీ భవన్ కు రావాలని సూచించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, కార్యకర్తల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచడానికి, అలాగే కార్యకర్తల సమస్యలను నేరుగా తీర్చడానికి ఇదో గొప్ప ఆలోచనే అని చెప్పాలి.

మొత్తానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ.. కార్యకర్తలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆనందం కలిగిస్తుందని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా చేర్చేలా కార్యకర్తలను ఇప్పటి నుండే ఇంకా బలంగా భాగస్వామ్యం చేసేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మర్రిగూడ మండల నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి.. మండల నాయకులకు సూచించిన ఎమ్మెల్యే

మర్రిగూడ మండలం లోని వివిధ సమస్యలపై మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల సమస్యలు రోడ్లు, విద్యుత్ ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బెల్ట్ షాపు ల పై సమగ్రమైన అధ్యయనం చేసి తన దృష్టికి తీసుకురావాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాసు, మర్రిగూడ మండల మాజీ జిల్లా ప్రాదేశిక సభ్యులు మేదరి యాదయ్య, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య లు పాల్గొన్నారు.
విద్యుత్ పనులకు 57 కోట్లు నిధులు మంజూరు
మునుగోడు నియోజకవర్గం:
నాణ్యమైన, భద్రతతో కూడిన విద్యుత్ అందించడమే తన ప్రధాన కర్తవ్యం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. విద్యుత్ పనులకు 57 కోట్లు నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విద్యుత్ అత్యవసర పనులకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా లో-వోల్టేజి సమస్య ఉండొద్దని విద్యుత్ అధికారులకు సూచించారు.

NLG: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

నల్లగొండ జిల్లా, దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున్న సభ్యులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా రాష్ట్రంలో 540 గురుకులాలు ఉంటే ఆ గురుకులాల సమస్యల ను పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు.

స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకునే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల పైగా పెండింగ్ లో ఉంటే పై చదువులు ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తపరిచారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు 33 రూపాయల అరవై పైసలు తోటి మూడు పూటల భోజనం పెట్టడం ద్వారా పౌష్టికాహారం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.

పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు దొంగతనాలు చేసిన వారికి నిందితులకు 50 పై చిలుకు రూపాయల తోటి మూడు పూట భోజనం పెడుతున్నారంటే విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుందని ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలు తెలుపుకుందామంటే ఇంతవరకు కూడా కొత్త ప్రభుత్వం లో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు.

ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యారంగా సమస్యలు పరిష్కరానికి చేసే ఈ దీక్ష ఇంతటితో ఆగదు ఈనెల 27 న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను ఐక్యం చేసి చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు పొట్ల రాకేష్, జిల్లెల్ల ఇద్ది రాములు, నెర్లపల్లి జైచరణ్, గోలి శివ, ఉంగరాలు శివయ్య, నేలపల్లి భాను, కావ్య, నందిని, మంజుల, మహేశ్వరి, రామావత్ చరణ్ తేజ్, మనోహర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్గానిక్ వ్యవసాయం పై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు
నల్లగొండ:
కే.ఎన్.బయోసైన్సెస్ మరియు శ్రీసత్యం వర్మి బయోఆర్గానిక్స్& కన్సల్టెన్సీ సంస్థల సంపూర్ణ సహకారంతో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం మరియు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం నిర్వహించి యువతీ యువకుల్లో శారీరకదారుఢ్యం మరియు సమాజానికి సంపూర్ణ ఆరోగ్యం అవగాహనపై క్షేత్రస్థాయి అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ రంగంలో యువతీ యువకులు రాణించేటందుకు ఉద్యోగ అవకాశాల కల్పన కొరకు కూడా ప్రయత్నిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
NLG: సిపిఎం పోరాటాల ద్వారానే  ప్రజల సమస్యలు పరిష్కారం: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్య దర్శి
నల్లగొండ జిల్లా:
సిపిఎం పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామ శాఖ ఆరవ మహాసభలు తిరుగండ్లపల్లి గ్రామంలో నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగాయి. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. పాలకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులు, కూలీల సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలిపారు. ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్ల కు డిపిఆర్ ఆమోదించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే డిపిఆర్ ను ఆమోదించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచుతారని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు నెలకి రూ.2,500 మరియు ఇతర పథకాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. మద్యం మత్తు పదార్థాలు యేరులై పారుతున్నాయని మునుగోడు నియోజకవర్గం లాగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలు ఊసే లేదని సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ఇంకా అనేకమందికి కాలేదని రుణమాఫీ చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కారం చేయుటకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహాసభల ప్రారంభ సందర్భంగా సిపిఎం జెండాను చల్ల ముత్యాలు ఆవిష్కరించగా,నీలకంఠం సత్తెమ్మ స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ శాఖ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠ రాములు, కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, దామెర లక్ష్మి, గడగోటి వెంకటేష్, కాగు వెంకటయ్య, నీలకంఠం లక్ష్మమ్మ, సిరసనవాళ్ళ ఎల్లయ్య, నీలకంఠ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం ప్ల కార్డులతో నాలుగు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసి  నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. గతంలో 2019 సంవత్సరంలో వేతనాల కోడ్, 2020లో ఐ ఆర్ కోడ్, ఓ ఎస్ హెచ్ కోడ్, సామాజిక భద్రత కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్ లు కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించింది. అంతకుముందు 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్ట బెట్టిందని, కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేస్తుందని ఆయన అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుంది గతంలో ఎన్నో సమ్మెలు సమరశీల ఉద్యమాలు జరిపినప్పటికీ బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ వ్యతిరేకించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి నిర్ణయించుకుందని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బ్లాక్ డే కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారని చెప్పారు.

ఆశా వర్కర్స్ యూనియన్, ఐకెపి వివో ఎల్ యూనియన్ రంగినేని చంద్రకళ, గంట మంజుల, లెంకలపల్లి పాపా చారి , మాధగోని యమున, లలిత, పల్లె మహేష్, జాజాల అనిత, ఆయిల్ కలమ్మ, రోజా, కలకొండ వెంకటమ్మ, వట్టిపల్లి విజయమ్మ, మంజుల, మైల నీలకంఠం,యాదయ్య, గడగూటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.