NLG: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
నల్లగొండ జిల్లా, దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున్న సభ్యులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా రాష్ట్రంలో 540 గురుకులాలు ఉంటే ఆ గురుకులాల సమస్యల ను పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు.
స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకునే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల పైగా పెండింగ్ లో ఉంటే పై చదువులు ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తపరిచారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు 33 రూపాయల అరవై పైసలు తోటి మూడు పూటల భోజనం పెట్టడం ద్వారా పౌష్టికాహారం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు దొంగతనాలు చేసిన వారికి నిందితులకు 50 పై చిలుకు రూపాయల తోటి మూడు పూట భోజనం పెడుతున్నారంటే విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుందని ఆరోపించారు.
విద్యార్థుల సమస్యలు తెలుపుకుందామంటే ఇంతవరకు కూడా కొత్త ప్రభుత్వం లో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు.
ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యారంగా సమస్యలు పరిష్కరానికి చేసే ఈ దీక్ష ఇంతటితో ఆగదు ఈనెల 27 న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను ఐక్యం చేసి చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు పొట్ల రాకేష్, జిల్లెల్ల ఇద్ది రాములు, నెర్లపల్లి జైచరణ్, గోలి శివ, ఉంగరాలు శివయ్య, నేలపల్లి భాను, కావ్య, నందిని, మంజుల, మహేశ్వరి, రామావత్ చరణ్ తేజ్, మనోహర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.



నల్లగొండ:
నల్లగొండ జిల్లా:
ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్ల కు డిపిఆర్ ఆమోదించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే డిపిఆర్ ను ఆమోదించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచుతారని తెలిపారు.
నల్లగొండ జిల్లా:
HYD: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ 1 కోటి రూపాయల విరాళం అందించింది. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్ ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఈ మేరకు చెక్కు అందజేశారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం:
ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యాచరణలో ఉచిత క్షేత్రస్థాయి వ్యవసాయ సదస్సులు
నల్లగొండ జిల్లా:
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 6 వ తరగతి నిరుపేద విద్యార్థి ఎస్.ఉదయానంద్, ఇటీవల పాఠశాల స్థాయిలో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 మిషన్ రాకెట్ మోడల్ ను విడిభాగాల తో తయారుచేసే అంశంపై ప్రతిభను చూపెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫిజికల్ సైన్స్ మాస్టర్ డాక్టర్ వై.శ్యాంసుందర్ రెడ్డి విద్యార్థికి నూతన వస్త్రములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య, ఉపాధ్యాయులు అందజేశారు.
Sep 23 2024, 21:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.6k