/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సన్నాలపై మక్కువ.. Raghu ram reddy
సన్నాలపై మక్కువ..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్‌ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు.

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్‌ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు. సన్నాలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనంగా 178 కోట్ల 92 లక్షల రూపాయల భారం పడనున్నది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,09,562 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇందులో దొడ్డు రకం వరి 36,676 ఎకరాల్లో సాగు చేయగా, సన్న రకం 1,72,879 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 78.79 శాతం సన్న రకం పంటను సాగు చేశారు. గతంలో సన్న రకం వరి ధాన్యం సాగు 35 శాతానికి మించలేదు. ఈసారి రికార్డు స్థాయిలో సన్నాలను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా బీపీటీ, సాంబమశూరి, జైశ్రీరాం, చిట్టి ముత్యాలు తదితర రకాల వరి ధాన్యాన్ని సాగు చేశారు.

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి సాగు వల్ల 4 లక్షల 49 వేల 554 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వస్తుందని, ఇందులో దొడ్డు రకం 91 వేల 700 టన్నులు, సన్న రకం 3 లక్షల 97 వేల 615 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. సన్న రకం ధాన్యం దిగుబడిలో 10 శాతం తిండి అవసరాలకు పోనూ 3 లక్షల 57 వేల 853 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం కేంద్రాలకు వస్తే మాత్రం క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 178 కోట్ల 92 లక్షల రూపాయల బోనస్‌ భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కామన్‌ రకం వరి ధాన్యం క్వింటాలుకు 2300 రూపాయలు కాగా, గ్రేడ్‌ ఏ రకం 2,320 రూపాయలు. అయితే సన్న రకం ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌ కిందనే తీసుకుంటున్నారు. 

దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించుకుంటున్నారు. ఈసారి సన్న రకం సాగు పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండనున్నది. ప్రభుత్వమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇవ్వనుండడంతో 2,800 రూపాయలు రానున్నాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే 10 వేల రూపాయలు రానున్నాయి. ఈ లెక్కలను అంచనా వేసే రైతులు జిల్లాలో అధికంగా సన్నరకం ధాన్యాన్ని పండిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 2800 రూపాయలకు పైగా ధర పలికితినే వారికి విక్రయించేందుకు మొగ్గు చూపుతారు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయని, ఇందులో 80లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రైతులకు బోనస్‌ ఇచ్చేందుకు 2,500 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయిస్తూ శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

జనవరి నుంచే రేషన్‌ కార్డులపై సన్న బియ్యం..

రేషన్‌ షాపుల ద్వారా సన్న రకం బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం రైతులతో సన్న రకాలను ప్రోత్సహిస్తున్నది. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం పంటను క్వింటాలుకు 500 రూపాయల బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయనున్నది. ఆ ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లింగ్‌ చేసి నిల్వ చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్‌ కార్డులపై ఇచ్చే బియ్యాన్ని సన్నవి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు దొడ్డు రకం బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకుంటున్న వినియోగదారులు వందకు 60 శాతం మంది ఆ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారని గమనించిన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తేనే వాటిని తిండి అవసరాలకు వినియోగించుకోనున్నారని, ప్రజలపై బియ్యం భారం పడకూడదని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వారం పాటు వర్షాలు

బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడిందని, థాయ్ లాండ్ కు ఉత్తరం వైపున మరో సర్క్యులేషన్ ఏర్పడిందని తెలిపింది.

ఈ రెండు సర్క్యులేషన్లు అల్పపీడనానికి దారితీస్తాయని అంచనా వేసింది. దీని ఫలితంగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ నెల 23 (సోమవారం) న ఆంధ్రప్రదేశ్, యానాంలో, 23 నుంచి 25 వరకు తెలంగాణలో, 24, 25న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపగ్రహ అంచనాల ప్రకారం..

ఆదివారం మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాలు మేఘావృతం అయి ఉంటాయని చెప్పారు. సాయంత్రం 5 గంటల తర్వాత రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు మున్నీరవుతున్న పేదలు

భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

భాగ్యనగరం హైదరాబాద్‌లో ఇవాళ (ఆదివారం) మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు.

నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు కూల్చివేయగా.. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. కూకట్‌పల్లి శాంతి నగర్‌లో బాధితుల రోదనలు మిన్నంటాయి. కాగా ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్ షటర్లు నేలమట్టమయ్యాయి.

పేదల పట్ల హైడ్రా కర్కశంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్న హైడ్రా అధికారులు పేదల పట్ల మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమకు కనీసం టైం ఇవ్వకుండా ఆస్తితో పాటు అందులో ఉన్న వస్తువులను సైతం నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా నిర్మాణాలు కూల్చేముందు మమ్మల్ని చంపేయండి’ అంటూ కొందరు బాధితులు ఏడవడం కనిపించింది. విలువైన సామాన్లు కూడా బయటకి తీసుకోకుండా.. ఏ మాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుపతి 'లడ్డూ ప్రసాదం' కేసులో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై హైదరాబాద్‌లో ఫిర్యాదు, తీవ్ర ఆరోపణలు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసిద్ధ 'లడ్డూ ప్రసాదం'లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే అంశం ఈరోజుల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. ఎన్డీయే పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసాదంలో కల్తీ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులపై హైదరాబాద్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆలయాన్ని అపవిత్రం చేయడంతో పాటు హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా "దుద్దేశపూరిత చర్య" అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టెస్టింగ్ ల్యాబ్ రిపోర్టును పేర్కొంటూ న్యాయవాది కె. కరుణ సాగర్ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యొక్క. ఈ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయానని కరుణ సాగర్ అన్నారు. దీనిపై విచారణ జరిపించాలని పోలీసులను అభ్యర్థించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసి కోట్లాది మంది హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఓ పోలీసు అధికారిని ప్రశ్నించగా.. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కావడంతో న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయపరమైన అభిప్రాయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నాణ్యత పరీక్షల కోసం పంపిన నమూనాల్లో నాణ్యత లేని నెయ్యి, కొవ్వు కల్తీ ఉన్నట్లు గుర్తించినట్లు శుక్రవారం వెల్లడించింది. లడ్డూలలో జంతువుల కొవ్వు కల్తీ అని రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చేశారు.

పావులు కదిపిన మోదీ: చైనాకు చెక్?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు సాగే పర్యటన ఇది. తొలి రోజున తీరిక లేని కార్యక్రమాల్లో గడిపారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఏర్పాటైన క్వాడ్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ముగిసింది.

దీని తరువాత ఆయన న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. లాంగ్ ఐలాండ్‌లో గల నుస్సౌ వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమెరికాలో నివసిస్తోన్న వందలాది మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్‌, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమ్మిట్ కొనసాగింది. పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి.

సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు, ఘర్షణలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్వాడ్ సదస్సు ఏర్పాటు కావడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం, వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కారించుకోవడానికి చర్చలే శరణ్యమని చెప్పారు.

స్వేచ్ఛా వాణిజ్యం, సమ్మిళిత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ రీజియన్‌ను నెలకొల్పుకోవాలనేదే క్వాడ్ భాగస్వామ్య దేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మిగిలిన దేశాలకు క్వాడ్ ఓ దిక్సూచిగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం జో బైడెన్, మోదీ, ఆంటోనీ అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ.. జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.దక్షిణాసియా రీజియన్‌లో తరచూ సరిహద్దు జలాల్లోకి ప్రవేశిస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తెర మీదికి తీసుకుని రావాలని నిర్ణయించారు. క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్‌కు రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు. యూఎస్ కోస్ట్ గార్డ్, భారత్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్‌కు ఇందులో భాగస్వామ్యాన్ని కల్పిస్తారు.

తీర ప్రాంతాల సరిహద్దు జలాల భద్రత కోసం ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం అనేది ఇదే తొలిసారి.ఇంటర్‌ ఆపరేబిలిటీని మెరుగుపరచడం, సముద్ర జలాల భద్రతను మరింత పటిష్ట పర్చడం, ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో మున్ముందు మరిన్ని జాయింట్ ఆపరేషన్/మిషన్‌లను చేపట్టాలని నిర్ణయించారు.

ఏడుకొండలవాడా..! క్షమించు 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష

 

అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. 

లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 

22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను. 

భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది. 

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

కామరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు, బంధులవులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబార్‌పేటకు చెందిన వీణ, కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోని హాయిగా జీవించాలని ఎన్నో కలలకన్నారు.

పెద్దల వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకురాగ అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీణ తన ఇంట్లో దూలానికి ఉరేసుకొని ప్రాణం తీసుకోగా.. సాయి కుమార్ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్రామాలకు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

బాలికలతో కేర్‌టేకర్‌ అనుచిత ప్రవర్తన

ఇక హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్‌టేకర్‌ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్‌పూర్‌లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్‌టేకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం

2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.

మరికొన్ని గంటల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదా సీదాగా జరగనుందని సమాచారం.

అయితే మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ కేబినెట్‌లోని దాదాపు 14 కీలక శాఖలు అతిషినే పర్యవేక్షించే వారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను ఆమె వద్దే ఉంచుకుంటారా? లేకుంటే.. వాటిని వీరికి కేటాయిస్తారా? అని చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.

2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి ఈ రోజు అధిష్టించనున్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేసిన విషయం విధితమే.

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఆయన... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే శాసన సభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనాకు అందజేశారు. అలాగే శాసనసభ పక్షం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఎల్జీకి కేజ్రీవాల్ వివరించారు. దీంతో ఢిల్లీ సీఎంగా ఈ రోజు అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న అతి పిన్న వయస్కురాలు అతిషినే కావడం గమనార్హం.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెక్‌ అంద‌జేత‌

ఇటీవ‌ల భారీ వ‌ర‌ద‌లు ఏపీ, తెలంగాణ‌ను ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా విజ‌య‌వాడ న‌గ‌రం అస్త‌వ్య‌స్త‌మైంది. దాంతో చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయంగా విరాళాలు అంద‌జేశారు. 

తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ షో క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది కూడా విరాళం ఇచ్చారు. రూ. 3ల‌క్ష‌ల విరాళం తాలూకు చెక్‌ను ఆయ‌న స్వ‌యంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అంద‌జేశారు. ఇక తాను ఇచ్చిన ఈ మూడు ల‌క్ష‌ల్లో వ‌ర‌ద పీడిత గ్రామ‌మైన ఏకే మ‌ల్ల‌వ‌రం (పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం) కు రూ. 1ల‌క్ష ఇవ్వాల‌ని, మిగ‌తా రెండు ల‌క్ష‌లు త‌న సొంత గ్రామం ప‌ల్లాప‌ల్లి గ్రామ పంచాయ‌తీకి ఇవ్వాల‌ని ఆది కోరారు. 

ఈ సంద‌ర్భంగా ఆది మాట్లాడుతూ.. వ‌ర‌ద‌ల కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన బాధితుల‌కు రూ. 6కోట్ల విరాళం ఇచ్చి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ అందిరిలో స్ఫూర్తిని నింపార‌ని అన్నారు. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయ‌తీల‌కు విరాలం ఇవ్వొచ్చ‌ని తెలిసి త‌న వంతుగా రూ. 3ల‌క్ష‌లు ఇచ్చాన‌ని ఆది తెలిపారు. 

కాగా, వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ప‌వ‌న్‌ రూ.6 కోట్లు విరాళం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌ల‌కు చెరో రూ.కోటి చొప్పున అంద‌జేశారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు ప్ర‌క‌టించారు. వీటిలో ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున ఇవ్వ‌నున్నారు.

విజయసాయి కుమార్తెకి చెందిన స్టార్ హోట‌ల్ నిర్మాణాలు కూల్చివేత..

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి త‌న‌ న‌క్ష‌త్ర హోట‌ల్ కోసం ఆక్రమిత స్థలంలో కాంపౌండ్ వాల్ ను నిర్మించారు.

దీంతో ఇక్క‌డ కూల్చివేతలు చేపట్టారు అధికారులు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

సర్వే నంబర్‌ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలున్నాయి. సుమారు 4ఎకరాల స్థలంలో ఈ అక్రమ కట్టడాలున్నట్లు ఆరోపణలున్నాయి.

దీనిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిల్‌ వేశారు. ఈక్రమంలో కోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపు చేపట్టారు. పర్యావరణ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మరోసారి తాజాగా శనివారం కూల్చివేతలు చేపట్టారు.