NLG: కార్యకర్త కుటుంబానికి భరోసాగా లక్ష రూపాయల చెక్కు అందించిన బీఎస్పీ
నల్గొండ జిల్లా:
బహుజన సమాజ్ పార్టీ మునుగోడు నియోజక వర్గం ఇంచార్జ్ నేరెళ్ళ ప్రభుదాస్ ఆధ్వర్యంలో పుల్లెంల గ్రామంలో గురువారం బీఎస్పీ నాయకుడు పోలే రమా శంకర్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం ఎంతో చురుకుగా పని చేసి చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన ఘనత రమా శంకర్ ది అని అన్నారు. ఆయన కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని అన్నారు.
అనంతరం పోలే రమా శంకర్ భార్య పోలె అంజలి, కుమార్తె పోలె ఆరాధ్య లకు రూ. 1,00,000/- ల చెక్కు ను ఆర్థిక భరోసా గా అందజేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి ఐతరాజు అబెందర్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఏకుల రాజా రావు, ఇంచార్జి పంబాల అనిల్, ప్రధాన కార్యదర్శి ఎస్ కే పాషా, మహిళా కన్వినర్లు లలితా భాయి, గీతా గణేష్, బీఎస్పీ ఇబ్రహింపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గ్యార మల్లేశం, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్ర బోస్, ఇంచార్జ్ ఏర్పుల అర్జున్, ప్రధాన కార్యదర్శి బుశిపాక మాణిక్యం,కార్యదర్శి అన్నేపాక శంకర్, సీనియర్ నాయకులు పూదరి నర్సింహ, కురుపాటి సామ్రాట్ కిరణ్, బొట్ట శివ, ఎర్రోళ్ళ వెంకటయ్య, వంశీ,రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు,మండల నాయకులు, తదితరులు హాజరయ్యారు.

నల్గొండ జిల్లా: 
అంబేద్కర్ విగ్రహాల జోలికొస్తే ఖబర్దార్: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
కులం మతం వర్గం ప్రాంతం తేడా లేకుండా భారతీయులందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన దేవుడు మహిళలు పురుషులతో సమానమే అని చాటి చెప్పిన మహనీయుడు , భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి గోప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.
నల్గొండ: భారత ఆహార సంస్థ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు డా.అగర్వాల్ కంటి ఆసుపత్రి వారు సంస్థ ప్రాంగణంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, సఫాయి కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 68,835 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,883 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.96 కోట్లు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణ తేజ అథిదిగృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
HYD: రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
HYD: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలం తో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఇవాళ రాష్ట్ర సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సిఎం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
నల్గొండ: స్వచ్ఛతా హి సేవలో భాగంగా ఈరోజు భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయ అధికారుల ఆధ్వర్యంలో రామగిరి నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు స్వచ్ఛ ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
నల్లగొండ జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలుపనుంది. దసరా లోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sep 21 2024, 10:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.1k