యరగండ్లపల్లి: ఎనబై ఐదు వేల రూపాయలు పలికిన గణేష్ లడ్డు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
ఈరోజు యరగండ్లపల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని లడ్డు వేలం పాట జరిగింది.
రూ. 85,000/- ఎనబై ఐదు వేల రూపాయలకు వల్లముల సత్తమ్మ యాదయ్య యాదవ్ లడ్డును కైవశం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా యువ చైతన్య యూత్ సభ్యులు వారిని శాలువాతో సన్మానించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు గణనాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకున్నారు.




నల్లగొండ జిల్లా:
భువనగిరి:
నల్లగొండ జిల్లా:
ఈ సందర్భంగా ఈసారపు వీరయ్య సరోజ కుటుంబం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ , నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ముందుగా ఆయన గన్ పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.
నల్లగొండ జిల్లా:
కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డి కి ఘనంగా సన్మానం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో హిందీ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హిందీ భాష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందీ భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
నల్లగొండ పట్టణ కేంద్రంలోని 33 వ వార్డులో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద వినాయకుడి శనివారం 8 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య రెడ్డి పాల్గొని వినాయకుడికి ప్రత్యెక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సేకరణ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. భారత ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
Sep 15 2024, 20:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
52.0k