NLG: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద, ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ కు పూర్ణచందర్ కు వినతి పత్రం ఇచ్చారు.
ఢిల్లీలో రామ్ లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్ జీ మాయావతి లు.. వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి, నిరసనలు తెలిపి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.
ముందుగా మాల మహానాడు నాయకులు డిఇఓ ఆఫీస్ వద్ద గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ జడ్జ్మెంట్ మనువాదుల జడ్జిమెంట్ అని, పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచమని, ఎస్సీ కుల గణన చేయాలని, ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
ఎంపర్కల్ డేటా లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే ఉందని, క్రిమిలేయరనే సమస్యను తీసుకొచ్చి భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తి వేయాలనే కుట్రలో భాగమే ఈ క్రిమిలేయర్ అని అన్నారు. దళితులకు మునిసిపాలిటీ లలో సపాయి కార్మికునిగా పనిచేస్తున్న వ్యక్తికి జాబ్ వస్తే రెండు తరాల వరకు రిజర్వేషన్లు ఉండకుండా ఈ క్రిమిలేయర్ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాలలు తక్కువ లేరని, మాల మాదిగలు సమానంగా ఉన్నారని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు.సబ్ కమిటీల లో రిటైర్డ్ జడ్జి లను గానీ, ప్రస్తుత జడ్జి లను గానీ తీసుకోవాలని ఇటీవల సిఎం కు కూడా వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధి గోలి సైదులు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు మనువాదులు ఇచ్చిన సూచనకు అనుకూలంగా ఉందని, వర్గీకరణ అంశం రాష్ట్రాలకు వదిలేయడాన్ని ఖండించారు. వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెనక్కి తీసుకోవాలని, లేనిచో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, తాళ్లపల్లి సురేష్, గండమల్ల జానయ్య, నాగటి జోసెఫ్, అద్దంకి రాంకోటి, ఏకుల సురేష్, నాగిల్ల మారయ్య, చిలగమల్ల యాదగిరి, గండమల్ల విగ్నేష్, గండ మల్ల శ్రీనివాస్, నాగిల్ల మారయ్య, మెరుగుమల్ల బిక్షం, పెరమళ్ళ ప్రమోద్, బొల్లు సైదులు, మేడ సైదులు, కొల్లి మురళి, కొల్లి ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.


ఢిల్లీలో రామ్ లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, బీఎస్పీ చీఫ్ బెహన్ జీ మాయావతి లు.. వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా వారు బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా దానికి మద్దతుగా ర్యాలీ చేపట్టి, నిరసనలు తెలిపి కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.
ముందుగా మాల మహానాడు నాయకులు డిఇఓ ఆఫీస్ వద్ద గల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా బయలుదేరి వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

HYD: వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత, నటి యార్లగడ్డ సుప్రియ మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఆమె ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.
గుంటూరు జిల్లా, తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమ తీర్పు వెల్లడించారు. 
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో నేరేళ్లపల్లి గ్రామ శాఖ బచ్చనబోయిన రమేష్, సైదుషన్, గుణబోయిన, యాదయ్య, ఎడ్ల లక్ష్మయ్య, ఉడత యాదయ్య, రామస్వామి, అసేన్, ఆక రాజు, మేకల రాజు, బచ్చనబోయిన కొండల్, రమేష్, గుణబోయిన రాములు, టేకులపల్లి వెంకన్న, బచ్చనబోయిన సత్తయ్య, పంచ శ్రీశైలం పంచ మారయ్య, కొంగలి శివ, ఆక ప్రభు, పొగాకు సతీష్ గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ కలెక్టరేట్:
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా, ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే మరణించడం జరిగిందని చెప్పారు.
అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నడుపుతున్నాడు.

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే కోరారు. వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటు పడాలన్నారు.
ఈ రోజు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత వర్ధంతి సందర్భంగా.. మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
వరంగల్ జిల్లా:
అనంతరం వరంగల్ జిల్లాలోని నాయకులకూ కార్యకర్తలకు దిశా - నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ మారుతీనేని ధర్మారావు, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు Ex MLA కొండేటి శ్రీధర్,Ex MLA ఆరూరి రమేష్, సభ్యత్వ నమోదు ఇంచార్జీ పొనుగోటి పాపారావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మరియు జిల్లా పదాధికారులు,నియోజకవర్గ కన్వీనర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల /డివిజన్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Sep 11 2024, 17:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.8k