AP: మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు 20 ఏళ్లు జైలు శిక్ష
గుంటూరు జిల్లా, తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమ తీర్పు వెల్లడించారు.
తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎన్.కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15 ఏళ్ల బాలికతో కోటేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తించి, బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
తల్లి దండ్రులు విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి కి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గర్భవతిగా నిర్ధారించారు. తల్లిదండ్రులు పాస్టర్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ సీహెచ్.రవిబాబు కేసు దర్యాప్తు చేపట్టి, పాస్టర్ ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

గుంటూరు జిల్లా, తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి ఒడిగట్టి గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి నీలిమ తీర్పు వెల్లడించారు. 

నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో నేరేళ్లపల్లి గ్రామ శాఖ బచ్చనబోయిన రమేష్, సైదుషన్, గుణబోయిన, యాదయ్య, ఎడ్ల లక్ష్మయ్య, ఉడత యాదయ్య, రామస్వామి, అసేన్, ఆక రాజు, మేకల రాజు, బచ్చనబోయిన కొండల్, రమేష్, గుణబోయిన రాములు, టేకులపల్లి వెంకన్న, బచ్చనబోయిన సత్తయ్య, పంచ శ్రీశైలం పంచ మారయ్య, కొంగలి శివ, ఆక ప్రభు, పొగాకు సతీష్ గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ కలెక్టరేట్:
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు పేద ప్రజలకు వరం లాంటిది, కానీ ఆరోగ్యశ్రీ సేవలలో పేదలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఇంటికి పంపిస్తున్నారని వాపోయారు. ఇటీవల దుగ్యాల గ్రామానికి చెందిన బుర్రి మట్టయ్య తన తండ్రి కి తుంటి వద్ద కాళు కు ఆరోగ్యశ్రీ ద్వారా దేవరకొండ లోని ప్రవేట్ హాస్పటల్లో ఆపరేషన్ చేయడం జరిగిందని.. కానీ ఆపరేషన్ ల్యాబ్ లో వాడిన పరికరాల ప్రాబ్లమా, ల్యాబ్ లో పరిశుభ్రత ప్రాబ్లమా ఏమో గానీ, వైద్యం వికటించి అనారోగ్య పాలై ఆపరేషన్ చేసిన 20 రోజులకే మరణించడం జరిగిందని చెప్పారు.
అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నడుపుతున్నాడు.

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి భూములు కోల్పోతున్న నిర్వాసితుల వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే కోరారు. వీలైనంతగా రైతులకు న్యాయం చేయడానికే పాటు పడాలన్నారు.
ఈ రోజు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత వర్ధంతి సందర్భంగా.. మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. 
వరంగల్ జిల్లా:
అనంతరం వరంగల్ జిల్లాలోని నాయకులకూ కార్యకర్తలకు దిశా - నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ మారుతీనేని ధర్మారావు, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు Ex MLA కొండేటి శ్రీధర్,Ex MLA ఆరూరి రమేష్, సభ్యత్వ నమోదు ఇంచార్జీ పొనుగోటి పాపారావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మరియు జిల్లా పదాధికారులు,నియోజకవర్గ కన్వీనర్లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల /డివిజన్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆర్డీవో రవి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అన్నారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా పానగల్లు వద్ద ఉన్న వల్లభరావు చెరువు వద్ద గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గంగా పూజ నిర్వహించి నీటి శుద్ధి నిర్వహించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం కోసం గంగా హారతి నిర్వహించి నీటి శుద్ధి చేశామని తెలిపారు. మూడు, నాల్గవ రోజు నుంచి నిమజ్జనం చేసుకునే విధంగా గంగా హారతి నిర్వహించామన్నారు. వల్లభ రావు చెరువు తో పాటు నాగర్జున సాగర్ ఎడమ కాలువ 14 వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసే విధంగా క్రేన్లు, బారికేడ్లను, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నల్లగొండ జిల్లా:
దాసరి వెంకటయ్య సత్తెమ్మ కుటుంబం 3వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడికి పూజలు నిర్వహించారు.
Sep 10 2024, 22:25
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.7k