NLG: సమాచార హక్కు వికాస సమితి జెండా ఆవిష్కరణ
నల్లగొండ: పట్టణంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో, ఆదివారం ఆ కమిటీ రాష్ట్ర గౌరవ సలహాదారుడు గాదె వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ ల చేతుల మీదుగా ఆర్టిఐ వికాస సమితి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికాస సమితి స్థాపించి 8 సం.లు పూర్తి చేసుకుని 9 సం.లో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆర్టిఐ ద్వారా ప్రభుత్వం లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, కార్యదర్శి కర్నాటి యాదగిరి, చింత సైదులు, గుండు సంపత్, ఆది మల్ల దేవేందర్, తుంగతుర్తి రామకృష్ణ, గంటకంపు గణేష్, యేష మల్ల రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: పట్టణంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో, ఆదివారం ఆ కమిటీ రాష్ట్ర గౌరవ సలహాదారుడు గాదె వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ ల చేతుల మీదుగా ఆర్టిఐ వికాస సమితి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికాస సమితి స్థాపించి 8 సం.లు పూర్తి చేసుకుని 9 సం.లో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆర్టిఐ ద్వారా ప్రభుత్వం లో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని అన్నారు.

HYD: తెలంగాణలో స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో బీసీ కమిషన్ కొత్త చైర్మన్ గా నియమితులైన నిరంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆయన మాట్లాడుతూ… సమాజ శ్రేయస్సు తన ప్రధాన ఎజెండా అని, సమాజంలో శ్రేయస్సు ఉండాలంటే జనాభాలో మెజారిటీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆ లక్ష్యం దిశగా బీసీ కమిషన్ పని చేస్తుందన్నారు.
ఖమ్మం ప్రకాష్ నగర్లో 9 మంది ప్రాణాలు కాపాడిన సుభాన్ ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు.
నల్గొండ మునిసిపాలిటీ కి రూ. 25 లక్షల నగదు పురస్కారం లభించింది. ఈ రోజు రాజస్థాన్ లోని జైపూర్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారం ను స్వీకరించారు.
కాగా స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024 లో నల్గొండ నగరం జనాభా కేటగిరి(<3 లక్షలు)లో దేశంలోనే 2వ స్థానం సాధించించిన విషయం తెలిసిందే. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో, 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, నల్గొండ నగరం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరచి ఈ ఘనతను సాధించి ఈ నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
HYD: రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాల కు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న ట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.
శనివారం ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్త ముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి సిఎం రేవంత్ రెడ్డి తొలి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.
ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
ఇటీవల అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని, అందరి పూజలు, దేవుడి ఆశీస్సుల వల్ల తక్కువ నష్టాలతో బయటపడ్డామని అన్నారు.
హైదరాబాద్ సీపీ గా సీవీ ఆనంద్
నల్లగొండ జిల్లా: 
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఎఎస్),
HYD: ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆది దేవుడు విఘ్నేశ్వరుడి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.
Sep 08 2024, 20:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.2k