నల్గొండ మునిసిపాలిటీ కి రూ. 25 లక్షల నగదు పురస్కారం..
నల్గొండ మునిసిపాలిటీ కి రూ. 25 లక్షల నగదు పురస్కారం లభించింది. ఈ రోజు రాజస్థాన్ లోని జైపూర్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన స్వచ్ఛ్ వాయు దివస్ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారం ను స్వీకరించారు. కాగా స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2024 లో నల్గొండ నగరం జనాభా కేటగిరి(<3 లక్షలు)లో దేశంలోనే 2వ స్థానం సాధించించిన విషయం తెలిసిందే. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో, 131 నగరాలు స్వీయ-అంచనా నివేదికలు సమర్పించ గా, నల్గొండ నగరం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరచి ఈ ఘనతను సాధించి ఈ నగదు పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
Sep 07 2024, 19:46