లెంకలపల్లి: తొలి పూజలు అందుకున్న గణనాథుడు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా, గ్రామంలోని గాంధీ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి తొలి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చాపల మల్లయ్య పద్మ కుటుంబం తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు.

నల్లగొండ జిల్లా: 

తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఎఎస్),
HYD: ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆది దేవుడు విఘ్నేశ్వరుడి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.
నల్లగొండ: మున్సిపల్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని RP రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నీలి ఆకాశాల కోసం స్వచ్ఛమైన గాలి అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిపుణులు విద్యార్థినిలకు గాలి కాలుష్యంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కోసం తీసుకోవలసిన చర్యలను వివరించారు.
కాలేజీ ఆవరణలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించారు. నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకుల్లో రెండవ స్థానం సాధించి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. గాలి స్వచ్ఛత సాధించడంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థిని లకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
PRTU TS యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండల శాఖ, సర్వసభ్య సమావేశం శుక్రవారం నారాయణపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది.
TG: వరద బాధితులకు అండగా నిలుస్తామంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) కు ఫిల్మ్ ఛాంబర్ తరపున రూ. 25 లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన కె. చంద్రకళ భర్త రాములు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి లో భాగంగా ముందస్తు చికిత్స కోసం 2,00,000 రూపాయలు ఎల్ ఓ సి చెక్కును మంజూరు చేయించారు.
నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని మర్రిగూడ బైపాస్ నుండి పిట్టంపల్లి రహదారి కనీస మరమ్మత్తులు లేక గుంతలమయమైంది. ప్రజా రవాణా కు అసౌకర్యంగా మారింది.
నల్లగొండ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వినాయకుడు సర్వవిఘ్నాలను తొలగించి జిల్లా ప్రజలకు మంచి చేకూర్చాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు.
Sep 07 2024, 15:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.8k