/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!! Raghu ram reddy
బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!!

విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. బుడమేరు వరద కొనసాగుతోంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగిస్తోంది. అక్కడే మకాం వేసిన మంత్రి రామానాయుడు ఈ సాయంత్రానికి పూడ్చివేత పనులు పూర్తవుతాయని వెల్లడించారు.

బుడమేరు ప్రవాహం పైన ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతించినట్లు కనిపిస్తున్నా...పూర్తిగా ముప్పు తొలిగిపోలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇంకా 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రెండు అడుగుల మేర వరద నీరు పెరగటంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు.

విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చేందుకు నాలుగు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది.

మంత్రి రామానాయుడు అక్కడే మకాం వేసారు. బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు.

బంగారం ధరలకు రెక్కలు

బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. వినాయకచవితినాడు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.

బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తుండగా.. వినాయకచవితినాడు బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,320 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,360కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 73,320వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు...

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,100గా ఉండగా.. కోల్‌కతాలో రూ. 85 వేలు, బెంగళూరులో రూ. 82,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,100 గా ఉంది.

రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో చేసిన మోసాన్ని ఎండగడుతూ ఊరూరా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు.బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రుణమాఫీ కాలేదంటూ పురుగుల మందు డబ్బాలతో వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

విరాళాలు ప్రకటించడంలో ఎందుకీ తేడా.. ఏపీకి ఒక లెక్క.. తెలంగాణకు మరో లెక్కనా..!

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో వారికి సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. శుక్రవారం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.6.50 కోట్ల విరాళం వచ్చింది. జీఎంఆర్ గ్రూప్ రూ.2 కోట్ల 50 లక్షలు విరాళం ప్రకటించింది. ఇక అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు. రూ.కోటి విరాళం ప్రకటించారు.

విక్రో ఫార్మా రూ.1 కోటి విరాళం ఇచ్చారు. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రతినిధులు కూడా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాయి. అయితే ఇదే శ్రీచైతన్య విద్య సంస్థలు ఏపీకి రూ.2 కోట్లు ఇచ్చాయి. తెలంగాణ కంటే ఏపీకి రూ.కోటి ఎక్కువగా విరాళంగా ఇచ్చింది. హైదరాబాద్ పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాలేజీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం తక్కువగా విరాళం ఇవ్వడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో ఒక్కొక్క ఇంటర్ విద్యార్థి వద్ద రెండు సంవత్సరాల్లో రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వసూలు చేస్తున్న శ్రీచైతన్య విద్య సంస్థలు తెలంగాణకు మాత్రం ఏపీకి కంటే తక్కువ విరాళం ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. విజయంతి మూవీస్ అధినేత మొదటగా.. ఏపీకి మాత్రమే రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తెలంగాణకు కూడా రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అయితే విరాళం ప్రకటించడంలో కూడా తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణలో ఉంటూ.. డబ్బులు సంపాదించుకునే వారు ఉన్న ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా శ్రీచైతన్య విద్య సంస్థలు పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.

విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ సిబ్బంది ఎంట్రీ

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, రాయనపాడు ప్రాంతాలను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా బుడమేరు మూడో గండి ద్వారా సుమారు 40,000 క్యూసెక్కుల వరద నీరు విజయవాడ లోకి రావడంతో అజిత్ సింగ్ నగర్, రాయనపాడు తదితర ప్రాంతాలను ముంచెత్తాయి. వరద నీరుతో ఆ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.

విజయవాడలో వరదలు రావడానికి కారణమైన బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు మూడో గండి పడిన ప్రాంతంలో దగ్గరుండి గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు బుడమేరు మూడో గండి పూడ్చివేత పనుల గురించి మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.

శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు బుడమేరు మూడో గుండి సడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. శనివారంలోపు బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి అవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం చంద్రబాబుకు చెప్పారని సమాచారం. బుడమేరు గండి పడిన ప్రాంతానికి మద్రాసు రెజిమెంట్ నుంచి సుమారు వంద మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు.

తాత్కాలికంగా ఇనుప రాడ్లు వేసి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే బుడమేరు మూడో గండి పడిన ప్రాంతానికి అవసరమైన సామాగ్రిని ఆర్మీ సిబ్బంది తరలిస్తున్నారు. బుడమేరు మూడో గండి పడిన ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయకపోతే సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ సిబ్బంది కూడా బుడమేరు గండ్లు పడిన ప్రాంతాలకు చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం లోపే బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు దాదాపు ఓ కొలిక్కి వస్తాయని జనవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ అతలాకుతలం కావడానికి కారణమైన బుడమేరు మూడవ గండిని వీలైనంత త్వరగా పూడ్చివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ సిబ్బందికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..!

కొద్దిరోజుల క్రితం హీరో రాజ్ తరుణ్ వివాదం పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్‌ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.

లావణ్య చేసిన ఆరోపణలపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.

ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య , మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని, వారిద్దరూ రూంలో కలిసి ఉన్నప్పుడు తాను చూశానని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే పోలీసులు ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు వెంటనే సమర్పించాలని పోలీసులు ఆమెకు తెలిపారు. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు.

రాజ్ తరుణ్ మోసాలకు పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత, రాజ్ తరుణ్ ఆమెను మోసం చేశారనే అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. ఈక్రమంలోనే ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. పోలీసులకు సమర్పించింది లావణ్య. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు.అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు.

టీడీపీ రాసలీలల ఎమ్మెల్యేకు గుండెపోటు

టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధిస్తూ వీడియోలతో సహా పట్టుబట్ట ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇవాళ ఉదయం గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం లైంగిక వేధింపుల వీడియో బయటపడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు.

గతంలో వైసీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజా ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధిస్తుండటంతో ఆమె టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా వేధింపుల వీడియోలు సైతం బయటపెట్టింది. దీంతో టీడీపీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది. అయితే ఆదిమూలం మాత్రం టీడీపీలో తన ప్రత్యర్దుల కుట్రగా దీన్ని అభివర్ణించారు.

మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా ఆదిమూలం వ్యవహారంపై ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేసిన అధిష్టానం.. ఆ వీడియోల్ని సైతం ల్యాబ్ కు పంపింది. అవి నిజమని తేలితే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు లేకపోలేదు.

ఇవాళ ఆదిమూలం నియోజకవర్గంలో మహిళలు ఆయనకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఆయన గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిమూలం ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు.

స్థానికత మీద తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

స్థానికత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇంతకూ తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారిని గుర్తించటం ఎలా? అన్నది మౌలికప్రశ్నగా మారింది. దీనికి కారణం.. తెలంగాణలోని మెడికల్.. డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాలే. అయితే.. ఈ వ్యవహారంలో తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న స్థానికులకే అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న వారంతా 85 శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది.

విద్యార్థుల స్థానికతను నిర్దారించటానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవన్న హైకోర్టు.. వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన తర్వాత వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు వర్సిటీ నిర్ధారించి.. సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీం వెలువరించిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉందని.. దీన్ని అడ్వొకేట్ జనరల్ సైతం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.

మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలు (2017)ను సవరించి.. 3(ఏ) నిబంధనను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 9న జారీచేసిన జీవో నెంబరు 33 ను సవాలు చేస్తూ హైకోర్టులో 53పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనలు సాగాయి. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించిన అంశాల్ని చూస్తే..

స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అర్హత పరీక్ష ఇంటర్ తో పాటు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన శాశ్విత నివాసులకు అవకాశం లేకుండా చేస్తోంది.

మెరుగైన విద్యా సంస్థలు.. ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకావం కోల్పోతారు.

దీనికి కౌంటర్ గా ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ తన వాదనల్ని వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఉభయుల వాదనలు విని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని సంక్షిప్తంగా చూస్తే..

తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికే మెడికల్.. డెంటల్ కోర్సుల్లో ఆడ్మిషన్లు కల్పించటమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ నిబంధన (3ఏ)

అభ్యర్థులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి. శాశ్వత నివాసులై ఉండాలి.

తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశిత అర్హత పరీక్షను తెలంగాణ రాష్ట్రంలో రాయలేదన్న కారణంగా ఆడ్మిషన్ ను నిరాకరిస్తే.. ఆ నిబంధన ఉద్దేశం నెరవేనట్లే.

తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న విద్యాసంస్థల్లో అర్హత పరీక్ష రాశారనో.. బయట నివాసం ఉన్నారనో ఆడ్మిషన్లను రిజెక్టు చేయటం సరికాదు.

ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు దాన్ని తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయాన్ని మరిచొపోవద్దు.

చెల్లని చట్టాల్ని చట్టసభలు ఎప్పుడూ తీసుకురావు. స్థానికులకు అవకాశాలు కల్పించటానికే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిబంధనను తీసుకొచ్చింది.

ఈ దశలో ఈ నిబంధనను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారు తెలంగాణలో మెడికల్ ఆడ్మిషన్లకు అర్హులవుతారు.

అప్పుడు రాష్ట్రంలోని శాశ్వత నివాసం ఉన్న వారు నష్టపోతారు.

ప్రభుత్వం జీవో నంబరు 33తో తీసుకొచ్చిన 3(ఏ) నిబంధన తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికి వర్తించదు.

స్థానికత నిర్దారణకు మార్గదర్శకాలు లేవు. వాటిని రూపొందించటానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాంఅవి రూపొందిన తర్వాత స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయింపజేసి.. సీట్లను కేటాయించాలి.

జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్క్రీమ్ అమ్మకాలు..

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు.

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం పిల్లలు తెగ ఇష్టంగా తింటున్నారట. రేటు ఎక్కువ ఉన్నా కూడా వెనుకాడకుండా తింటున్నారు. కారణం ఇక్కడ విస్కీని ఉపయోగించి తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లే. ఇవేంటో కూడా తెలియని చిన్నారులు ఈ ఐస్‌క్రీమ్ పట్ల ఆకర్షితులవుతున్నాయి.

భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు బయటపెట్టారు. ఇవాళ పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి వన్ అండ్ ఫైవ్ యజమాని అమ్ముతున్నాడు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నారు. ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.

మరింత అమ్మకాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్‌లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌లను జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ఐస్‌క్రీమ్ పార్లర్ ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్‌క్రీములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

నల్లగొండ జిల్లా పొలంలో ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. ఏంటా అని ఆరా తీయగా..

నల్లగొండ జిల్లాలో ఆకాశంలో చక్కెర్లు కొడుతూ అత్యవసరంగా ల్యాండ్‌ కావడం కలకలం రేపింది. చిట్యాల మండలం వనిపాకలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్‌ అయింది.

దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం జైపూర్ నుంచి కొన్ని ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులను రక్షించి వారికి సహాయక చర్యలను అందించిన హెలికాప్టర్లు తిరుగు ప్రయాణమయ్యాయి.

జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో చిట్యాల మండలం వనిపాకలలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండ్ అయింది. కాగా, హెలికాప్టర్‌లో ఉన్న పైలట్‌తో సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో హెలికాప్టర్‌లో సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఒక్కసారిగా చక్కర్లు కొడుతూ హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.