/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz స్థానికత మీద తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు! Raghu ram reddy
స్థానికత మీద తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

స్థానికత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇంతకూ తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారిని గుర్తించటం ఎలా? అన్నది మౌలికప్రశ్నగా మారింది. దీనికి కారణం.. తెలంగాణలోని మెడికల్.. డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాలే. అయితే.. ఈ వ్యవహారంలో తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న స్థానికులకే అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలకు జీవో 33 ద్వారా చేసిన సవరణ 3(ఏ)ను రద్దు చేస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న వారంతా 85 శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది.

విద్యార్థుల స్థానికతను నిర్దారించటానికి ఎలాంటి మార్గదర్శకాలు లేవన్న హైకోర్టు.. వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నట్లుగా పేర్కొంది. ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన తర్వాత వాటి ఆధారంగా విద్యార్థుల స్థానిక కోటాను కాళోజీ నారాయణరావు వర్సిటీ నిర్ధారించి.. సీట్లను కేటాయిస్తుందని తెలిపింది. ఆలిండియా సర్వీసు ఉద్యోగుల పిల్లలకు మీనాక్షి మాలిక్ కేసులో సుప్రీం వెలువరించిన తీర్పు ప్రకారం స్థానిక కోటా కింద సీట్లను కేటాయించాల్సిన అవసరం ఉందని.. దీన్ని అడ్వొకేట్ జనరల్ సైతం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.

మెడికల్ ఆడ్మిషన్ల నిబంధనలు (2017)ను సవరించి.. 3(ఏ) నిబంధనను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 9న జారీచేసిన జీవో నెంబరు 33 ను సవాలు చేస్తూ హైకోర్టులో 53పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనలు సాగాయి. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించిన అంశాల్ని చూస్తే..

స్థానికత నిబంధనపై గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అర్హత పరీక్ష ఇంటర్ తో పాటు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాలన్న నిబంధన శాశ్విత నివాసులకు అవకాశం లేకుండా చేస్తోంది.

మెరుగైన విద్యా సంస్థలు.. ఇతర కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు ఈ జీవో కారణంగా అవకావం కోల్పోతారు.

దీనికి కౌంటర్ గా ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ తన వాదనల్ని వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఉభయుల వాదనలు విని కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని సంక్షిప్తంగా చూస్తే..

తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికే మెడికల్.. డెంటల్ కోర్సుల్లో ఆడ్మిషన్లు కల్పించటమే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ నిబంధన (3ఏ)

అభ్యర్థులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలోనే చదివి ఉండాలి. శాశ్వత నివాసులై ఉండాలి.

తెలంగాణకు చెందిన వ్యక్తి నిర్దేశిత అర్హత పరీక్షను తెలంగాణ రాష్ట్రంలో రాయలేదన్న కారణంగా ఆడ్మిషన్ ను నిరాకరిస్తే.. ఆ నిబంధన ఉద్దేశం నెరవేనట్లే.

తెలంగాణకు చెందిన వ్యక్తి రాష్ట్రం బయట ఉన్న విద్యాసంస్థల్లో అర్హత పరీక్ష రాశారనో.. బయట నివాసం ఉన్నారనో ఆడ్మిషన్లను రిజెక్టు చేయటం సరికాదు.

ఒక నిబంధనపై వ్యాఖ్యానించే ముందు దాన్ని తీసుకొచ్చిన చట్టసభలకు వాటి గురించి స్పష్టమైన అవగాహన ఉంటుందన్న విషయాన్ని మరిచొపోవద్దు.

చెల్లని చట్టాల్ని చట్టసభలు ఎప్పుడూ తీసుకురావు. స్థానికులకు అవకాశాలు కల్పించటానికే రాష్ట్ర ప్రభుత్వం తాజా నిబంధనను తీసుకొచ్చింది.

ఈ దశలో ఈ నిబంధనను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న వారు తెలంగాణలో మెడికల్ ఆడ్మిషన్లకు అర్హులవుతారు.

అప్పుడు రాష్ట్రంలోని శాశ్వత నివాసం ఉన్న వారు నష్టపోతారు.

ప్రభుత్వం జీవో నంబరు 33తో తీసుకొచ్చిన 3(ఏ) నిబంధన తెలంగాణలో శాశ్విత నివాసం ఉన్న వారికి వర్తించదు.

స్థానికత నిర్దారణకు మార్గదర్శకాలు లేవు. వాటిని రూపొందించటానికి ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాంఅవి రూపొందిన తర్వాత స్థానిక విద్యార్థులకు వాటిని అన్వయింపజేసి.. సీట్లను కేటాయించాలి.

జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్క్రీమ్ అమ్మకాలు..

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు.

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు? అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం పిల్లలు తెగ ఇష్టంగా తింటున్నారట. రేటు ఎక్కువ ఉన్నా కూడా వెనుకాడకుండా తింటున్నారు. కారణం ఇక్కడ విస్కీని ఉపయోగించి తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లే. ఇవేంటో కూడా తెలియని చిన్నారులు ఈ ఐస్‌క్రీమ్ పట్ల ఆకర్షితులవుతున్నాయి.

భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు బయటపెట్టారు. ఇవాళ పిల్లల ఐస్క్రీమ్లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐస్క్రీమ్లో పేపర్ విస్కీ కలిపి వన్ అండ్ ఫైవ్ యజమాని అమ్ముతున్నాడు. 60 గ్రాముల ఐస్క్రీమ్లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నారు. ఐస్క్రీమ్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు.

మరింత అమ్మకాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్‌లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వన్ అండ్ ఫైవ్ ఐస్క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌లను జూబ్లీహిల్స్‌లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ఐస్‌క్రీమ్ పార్లర్ ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్‌క్రీములను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

నల్లగొండ జిల్లా పొలంలో ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. ఏంటా అని ఆరా తీయగా..

నల్లగొండ జిల్లాలో ఆకాశంలో చక్కెర్లు కొడుతూ అత్యవసరంగా ల్యాండ్‌ కావడం కలకలం రేపింది. చిట్యాల మండలం వనిపాకలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్‌ అయింది.

దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం జైపూర్ నుంచి కొన్ని ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులను రక్షించి వారికి సహాయక చర్యలను అందించిన హెలికాప్టర్లు తిరుగు ప్రయాణమయ్యాయి.

జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో చిట్యాల మండలం వనిపాకలలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండ్ అయింది. కాగా, హెలికాప్టర్‌లో ఉన్న పైలట్‌తో సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో హెలికాప్టర్‌లో సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఒక్కసారిగా చక్కర్లు కొడుతూ హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు

జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెలుగు మీడియం రెస్టారెంట్‌‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన జ్యూస్‌లు, పుట్టగొడుగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెస్టారెంట్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, మటన్‌‌లను కనుగున్నారు.

జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెలుగు మీడియం రెస్టారెంట్‌‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన జ్యూస్‌లు, పుట్టగొడుగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెస్టారెంట్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్, మటన్‌‌లను కనుగున్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం రెస్టారెంట్ యాజమాన్యానికి షాకోజ్ నోటీసులు జారీ చేశారు. బిర్యానీలో వెంట్రుకులు వచ్చాయంటూ.. ఇటీవల ఓ కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

అదీకాక సోమవారం బంజారాహీల్స్‌లోని పలు రెస్టారెంట్లపై తెలంగాణ కమిషనర్ ఆప్ ఫుడ్ సేఫ్టీకి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు వరుస దాడులు చేపట్టారు. ఈ సందర్బంగా రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారం ఆ యా రెస్టారెంట్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వంటశాలలో గడువు తీరిన పలు ఆహార పదార్థాలను సైతం వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. ‌

అదే విధంగా పలు ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన వస్తువులపై లేబుళ్లు లేకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ సంద్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వంటశాలతోపాటు ఆహార పదార్ధాలు నిల్వ ఉంచే ప్రాంతాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

ఆ క్రమంలో రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఆహారంపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీకి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పలు హోటళ్లు, రెస్టారెంట్లపై వరుస దాడులు నిర్వహిస్తున్నారు

అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రా ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్లు ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తోందని చెప్పారు.

దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అక్కడక్కడ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలన్నారు.

ఇదిలాఉంటే.. గడిచన 24 గంటల్లో అనకాపల్లిలోని చోడవరంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉత్తరాంధ్ర తీరంలో రానున్న మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వేటకు వెళ్లినట్లయితే.. వెంటనే తిరిగి రావాలని సూచించారు.

మరికొన్ని రోజులు జైల్లోనే కేజ్రీవాల్... బెయిల్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్

మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ నెల 10న తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్నిరోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కేజ్రీవాల్ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 11 వరకు పొడిగించింది. 

మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. 

విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీబీఐ తీరును తప్పుబట్టారు. మద్యం పాలసీ కేసు నమోదయిన రెండేళ్ల తర్వాత సీఎంను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ రాగానే సీబీఐ 'ఇన్స్యూరెన్స్ అరెస్ట్' చేసిందన్నారు. ఇది ఆయనను జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నమేనని ఆరోపించారు. అరెస్టుకు ముందు నోటీసులు ఇవ్వలేదన్నారు.

దీంతో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, ఈ నిబంధనలను ఎందుకు పాటించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు, బెయిల్ పిటిషన్‌పై కేజ్రీవాల్ తీరును సీబీఐ తప్పుబట్టింది. ఆయన తన అరెస్టును సెషన్స్ కోర్టులో సవాల్ చేయకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

భారీ వర్షాలకు (Heavy Rains) తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంభవించిన వర్షపు ఉధృతికి జరిగిన నష్టంపై గురువారం నాడు నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనాపరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికి ఆన్‌లైన్‌లో టెండర్లు అప్‌డేట్ చెయ్యాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమయి పనిచేసిన నీటిపారుదల శాఖా సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చుశాయన్నారు.

రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన కనిపించలేదన్నారు. తద్వారా విపత్తులు సంభవించినప్పుడు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఒక దగ్గర రెగ్యులేటరీ జామ్ అయ్యిందన్నారు. మరోచోట షట్లర్ ఎత్తుతుంటే తెగిపోయిందన్నారు. ఈ తరహా సంఘటనలు మరోసారి పునరావృతం అయితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరేరాం, శంకర్.. నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా దాస్ నాధ్, డిప్యూటీ ఈఎన్‌సీ కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖా చీఫ్ ఇంజినీర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు

మళ్ళీ భారీవర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోస్తా ఆంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతుందని ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి నేటి ఉదయానికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అంతేకాదు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే ఆయా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కాగా నిన్న రాష్ట్రంలో సగటున 2.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 6.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక సిద్దిపేట జిల్లాలో 5.47 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.అన్ని జిల్లాలలోనూ సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా సాధారణం కంటే అధికంగా 40% వర్షపాతం నమోదైనట్టుగా వెల్లడించింది. ఇక రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది

బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

బుడమేరు (Budameru) వరద నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. బాధితులు బుధవారం వెల్లువలా ముంపు ప్రాంతం నుంచి బయటకు తరలివస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, రాధానగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇందిరానాయక్‌ నగర్‌, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నాటికి కండ్రిక, అంబాపురం వైపు ఉన్న ఆంధ్రప్రభ కాలనీ 11లో ఇంకా మెడలోతు నీటితోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 వేల మంది బుధవారం మధ్యాహ్నానికి బయటకు వచ్చేశారు. ఇంకో 75 వేల మంది బయటకు రావల్సి ఉంది.

బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకుల పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా నాలుగు నుంచి పది కిలో మీటర్ల మేర నడుచుకుని రావటంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీవ్యాన్‌లు, ట్రాక్టర్ల వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపులరోడ్డు, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ అధికారి కోన శశిధర్‌ బాధితుల తరలింపు విషయంలో చొరవ చూపించారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి అందులోకి స్థానిక కార్పొరేషన్‌ సిబ్బందిని వరద ముంపు ప్రాంతాల్లోకి పంపించారు. పోలీసు శాఖ నుంచి ఏడీసీపీ గున్నం రామకృష్ణ ఒకేఒక్కడుగా సింగ్‌నగర్‌ దగ్గర పనిచేశారు. అటు కోన శశిధర్‌, ఇటు గున్నం రామకృష్ణ ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ వరద బాధితుల తరలింపు కోసం వాహనాలు, సిబ్బందిని పంపిస్తూ బాధితులను తరలించారు. మాజీ మునిసిపల్‌ కమిషనర్‌, ప్రస్తుత సిఎంఓలో పనిచేస్తున్న ప్రద్యుమ్న కలెక్టరేట్‌కు వచ్చిన తరువాతే బాధితుల ఆపరేషన్‌ ఓ గాడిలో పడింది

నాలుగో రోజు సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల నుంచి వరద బాధితులను తీసుకువచ్చే విషయంలో ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించిన పడవలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్లు మూడు వంతులకుపైగా సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ సర్వీసు రోడ్డులోనే నిలిపేశారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన ‘కన్నీళ్లు–కష్టాలు’ కథనంపై జిల్లా యంత్రాంగం తెల్లవారుజామునే స్పందించింది. ఆహార వ్యర్ధాలతో తీవ్ర అపరిశుభ్రంగా, దుర్గంధంగా ఉన్న సింగ్‌నగర్‌ ఫ్లై ఓవర్‌ను మాత్రం పరిశుభ్రం చేశారు. ఆ తరువాత జిల్లా యంత్రాంగం ఈ బోట్లను సింగ్‌నగర్‌ నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు పంపిస్తుందని భావిస్తే ఆ పని చేయలేదు. బోట్ల నిర్వాహకులకు జిల్లా యంత్రాంగం నుంచి కనీస సహకారం లేదు. కేవలం డాబా కొట్లు సెంటర్‌ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే 75 వేలకుపైగా బాధితులు బయటకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒకటి, రెండు అడుగులు నీటి మట్టం తగ్గటంతో శివారు ప్రాంత వాసులు కూడా తరలిరావటం పరిమిత సంఖ్యలో ప్రారంభమైంది. వీరికి ఆహారం, నీటి పంపిణీ జరగలేదు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బోట్లు కూడా సర్వీసు రోడ్డు పక్కనే పెద్ద సంఖ్యలో నిలిపేశారు. చాలా బోట్లు లారీల నుంచి కూడా బయటకు తీయలేదు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బోట్లు 30 శాతం వరద నీటిలోకి దిగి బాధితులను రక్షించాయి.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. 

తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేశారు. సురేష్ ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సురేష్ అజ్ఞాతంలోకి పారిపోయారు.

  హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీస్ ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లి సురేష్ ను అరెస్ట్ చేశారు.

సురేష్ ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.