సూర్యాపేట: జన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ యాదవ్..
బీపీ మండల్ జయంతి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబు బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ జయంతి కార్యక్రమం జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో 60 ఫీట్ల రోడ్లో మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి డాక్టర్ వూర రామూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి బీపీ మండల్ వల్లనే బీసీలకు విద్య, ఉద్యోగాలో 27% రిజర్వేషన్లు వచ్చాయని తెలియజేశారు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శీలం యాదగిరి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు అండగా ఉన్నది బీపీ మండల్, వారి ఉద్యమ స్ఫూర్తితో 1993 నుండి బీసీలకు 27% విద్యా ఉద్యోగులో రిజర్వేషన్లు పొందుతున్నారు అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వము సమగ్ర కులగణన జరిపి చట్టసభలలో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
సభా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఇప్పుడు జరగవలసిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమం, మండల్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి బీసీ బిడ్డ మన రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వెంకట నరసయ్య, ముద్దం బిక్షపతి, తోట శ్రీనివాస్, గోపీనాథ్, జటంగి వీరస్వామి, వెంకట్, వీరబోయిన లింగయ్య, భారి అశోక్, పల్లెటి రమేష్, మధుకర్, మహేష్, రాజేష్, మల్లేష్, శ్రీను, నగేష్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Aug 25 2024, 17:56