మాల మహానాడు ఆధ్వర్యంలో మర్రిగూడ మండలంలో భారత్ బంద్
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపుమేరకు ఇవాళ మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలో ర్యాలీలు నిరసనలు చేపట్టి, స్కూలు కళాశాలలు తిరిగి భారత్ బంద్ నిర్వహించారు.
మారయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకమని, వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలోకి రాదని, ఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారమే చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఈద కృష్ణ, ఈద కాశి, ప్రభుదాస్, నరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Aug 21 2024, 21:41