మర్రిగూడ మండలంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈసందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభివృద్ధి మార్గంలో దేశాన్ని నడిపించిన మహా నాయకుడని, రాజీవ్ గాంధీ యువతకు స్ఫూర్తి ప్రదాత అని వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, నరసింహారెడ్డి, జంగిలి రవి, గంట యాదయ్య, పి ఏ సి ఎస్ డైరెక్టర్ లింగయ్య., కొడాలి అల్వాల్ రెడ్డి, లవకుమార్, రేణుక వెంకన్న, జమ్ముల వెంకటేష్ గౌడ్, నందికొండ లింగారెడ్డి కోలుకుల పల్లి శంకర్, ఎలిమినేటి సత్తిరెడ్డి, మేతరి శంకర్, రాములు, పొనుగోటి శేఖర్, పగడాల అంజయ్య, పంతంగి సుధాకర్, పగడాల చిన్నయ్య, ఎడ్ల ముత్తయ్య, గ్యార యాదయ్య, సిల్వర్ వెంకటయ్య, వెంకటంపేట చంద్రయ్య, పగడాల యాదయ్య, గ్యార వెంకటేష్,
సిరుపంగి శ్రీనివాస్, బిక్షమాచారి, సిలివేరి యాదయ్య, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా: 
నల్లగొండ జిల్లాలో నిత్యం కరువుకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ:
నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.
రైతుబడి కార్యక్రమంలో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ లు తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులకు ఎంపికయ్యారు. వారిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి గారు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి యువతను చైతన్య పరుస్తూ భారత రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో తెలియపరుస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఇప్పుడు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా నిరంతరం పనిచేస్తుందని వారు గుర్తు చేశారు.
Aug 20 2024, 21:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.0k