గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చందంపేట పీ ఏ సి ఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి లు శుక్రవారం డా. బుర్రి వెంకన్నను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను దళిత రత్న బుర్రి వెంకన్న రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని నేడు ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం.. ఆయన మన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ వాసి కావడం సంతోషకరమని అన్నారు.
డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగ ఫలాలు, హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటాలు నిర్వహించినందుకు, నాకు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన గౌరవ డాక్టరేట్ ను తన వెన్నంటూ ఉండి సంపూర్ణ సహకారం అందించిన తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, డివిజన్ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, పీఏ పల్లి మండల అధ్యక్షులు జిల్లా రాములు, కొండమల్లేపల్లి మండల ఉపాధ్యక్షులు చేపూరి రాజేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, మామిడి చెట్టు యాదగిరి. టీజీ ఎంఆర్పిఎస్ మల్లేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, కడారి రాజు, ఖండేలా వెంకన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Aug 17 2024, 19:45