/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కింగ్ డమ్ ఆప్ టాలెంట్ రికార్డ్స్ బుక్ ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న దళితరత్న డా. బుర్రి వెంకన్న Mane Praveen
కింగ్ డమ్ ఆప్ టాలెంట్ రికార్డ్స్ బుక్ ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న దళితరత్న డా. బుర్రి వెంకన్న
*అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన దళిత రత్న డా. బుర్రి వెంకన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్రం*
*డా. బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, బొజ్జా తారకం లు నాకు స్ఫూర్తి: డాక్టర్ బుర్రి వెంకన్న*

నల్గొండ: జిల్లా, పెద్ద అడిసర్లపల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలతో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, లను స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుల ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగం లో ఉన్న హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటం దిశగా పనిచేస్తున్నందున, తన సేవలను గుర్తించి 'కింగ్డమ్ ఆఫ్ టాలెంట్ రికార్డ్ బుక్' ద్వారా వరల్డ్ రికార్డ్ గౌరవ డాక్టరేట్ అవార్డు ను అందుకోవడం జరిగింది. మీడియా తో డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక అవార్డ్స్ రివార్డ్స్ ని అందుకోవడం జరిగిందని బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు అందుకున్న అవార్డు పురస్కారాలు
1)దళిత రత్న అవార్డు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అందుకోవడం జరిగింది.
2) జాతీయ అంబేద్కర్ అవార్డు పురస్కారాన్ని బహుజన సాహిత్య అకాడమీ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అందుకోవడం జరిగింది.
3) ఢిల్లీలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
4) జాతీయ ఎక్స్లెంట్ అవార్డు పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారి చేతుల మీదుగా అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
5) సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ అవార్డును లైన్స్ క్లబ్ ద్వారా అందుకోవడం జరిగింది.
6) భారతదేశ గౌరవ పురస్కారం అవార్డును మయూరి ఆర్ట్స్ సంస్థ ద్వారా అందుకోవడం జరిగింది.
7) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారం అవార్డును కళానిలయం ఆధ్వర్యంలో అందుకోవడం జరిగింది.
8) భారత విశిష్ట గౌరవ పురస్కారాన్ని జాతీయ అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ద్వారా అందుకోవడం జరిగింది. 9)ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 10) ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్.
11) ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్ 12) ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్
13) ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,
14) ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,
15) ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,
16) ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్, 17)ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,
18)ఇంటర్నేషనల్ ప్లాటినుం బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు
19) ఇండియన్ ఎక్స్లెన్స్ అవార్డు
20) హైదరాబాదులోని త్యాగరాయ గణ సభ లో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
ఆగస్టు 2, 2024 న కింగ్డమ్ ఆఫ్ టాలెంటె రికార్డ్స్ బుక్ ద్వారా ప్రకటించిన వరల్డ్ రికార్డ్ బుక్ గౌరవ డాక్టర్ ను అందుకున్నట్లు తెలిపారు.

నా వెన్నంటూ ఉంటూ అహర్నిశలు సంపూర్ణ సహకారాన్ని అందించినందుకు గాను, అనేక విజయాలు సాధించగలిగానని అందుకోసం ఆయన ఈ అవార్డును మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా వెన్నంటూ ఉంటూ నేను సామాజిక కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో నా గురువర్యులు ముందుండి నడిపించినందుకు గాను శిరస్సు వంచి అభివందనాలు తెలియజేస్తూ, నేను తలపెట్టే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి అందించి గొప్ప గుర్తింపు తీసుకురావడానికి, అనేక విజయాలు సాధించడానికి సహకరించిన దేవరకొండ డివిజన్ పాత్రికేయులకు, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ అవార్డు ద్వారా తన పై మరింత సమాజిక బాధ్యత పెరిందని డా.బుర్రి వెంకన్న అన్నారు.
పోలీసులు, నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హోరాహోరీ ఎన్‌కౌంటర్

పోలీసులు, నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు

పోలీసుల మెరుపు దాడికి తాళలేక పరారైన నక్సలైట్లు

భారీగా ఆయుధాలతో పాటు 38 లక్షల నగదు స్వాధీనం

నగదు డంప్‌లో రూ.10 లక్షల వరకు పాత 2 వేల రూపాయల నోట్లు

పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్
NLG: మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
మండల మహిళా సమైక్యలో అటెండర్ లుగా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం రూ.18 వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండలో డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి  తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు.

జిల్లాలో అటెండర్స్ కి రూ. 2 వేలు నుండి 6 వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
             
ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG: సీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు

నల్గొండ : ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్ పల్లి (మం) గుమ్మల బావి వద్ద గల పోలీస్ ఫైరింగ్ ప్లేస్ వద్ద పోలీసులు దగ్ధం చేశారు.

గంజాయి విలువ ఒక కోటి 41 లక్షల 25 వేలు ఉంటుందని అంచనా వేశారు.మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ రవాణా పై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరోసారి స్పష్టం చేశారు.

క్రీడాకారులకు టీషర్ట్స్ పంపిణీ
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన క్రీడాకారులకు సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా 1టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ హాజరై క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండి మంచి అలవాట్లను మరియు క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుంటూ క్రమశిక్షణతో చదువులలో కూడా రానిస్తే అద్భుతమైన జీవితాన్ని పొందవచ్చునని విద్యార్థుల నిర్దేశించి మాట్లాడారు.

అదేవిదంగా డ్రగ్స్ పై కూడా అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బొట్టుగూడ హైస్కూల్లో నిర్వహించడం జరిగింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులు చదివే బొట్టుగూడ హైస్కూల్ కు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందరికి వచ్చి సహకరిస్తే మంచి క్రీడాకారులే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను పాఠశాలల్లో తయారు చేయవచ్చునని తెలియజేస్తూ పోలీస్ శాఖ వారికి మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్సై శంకర్ ను పాఠశాల పక్షాన శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర క్రీడా విభాగం ప్రధానకార్యదర్శి పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
NLG: పోరాట ఫలితమే ఇళ్ల స్థలాలు:కంబాలపల్లి ఆనంద్ 
పోరాట ఫలితమే ఇళ్ల స్థలాలు
దేవరకొండ: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితమే జాలుతండ గుడిసెవాసులకు 2006లో పట్టాలు ఇచ్చారని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్  అన్నారు.

సోమవారం దేవరకొండ మండలం,కట్ట కొమ్ము తండ గ్రామపంచాయతీ పరిధిలోని జాల్ తండా గుడిసె నివాసుల సమావేశంలో కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుండి బతుకుతెరువు కొరకు 2000 సంవత్సరంలో కులవృత్తి రాయి కొట్టుకొని జీవనం గడుపుతున్న వారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా 123 సర్వే నెంబర్లలో అప్పటి ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు 40 మందికి పట్టాలిచ్చి కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని వారు తెలిపారు. మిగతా 40 మందికి గుడిసెలు వేసుకొని నివాసముంటున్న వారికి పెండింగ్ లో ఉన్నాయని, వారికి వెంటనే 58, 59 జీవో ప్రకారం ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాలని నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గోగుల శీను సంపంగి గోపి సంపంగి నరసింహ పాలపు శివ నాగరాజు రేణుక తదితరులు పాల్గొన్నారు
NLG: డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించాలి
మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ కార్యాలయంలో దామెర లక్ష్మీ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చాలా పీడిత ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించి, డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించి, సాగునీరు అందించే వరకు పోరాటాలు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.

2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టముక్కల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్ నింపి సాగునీరు అందించడం ద్వారా, ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వ నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగినా కీలకమైన డిపిఆర్ను ఆమోదించకపోవడం, అట్లాగే సుమారు 27 కిలోమీటర్లు కాలువను తవ్వి పనులను సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీరమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.

డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ రిజర్వాయర్లకు కాలువలు పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు కాగు లింగయ్య కాగు ఎల్లయ్య బొల్లంపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు
మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసి బస్సులు నడిపించాలి: ఎమ్మెల్యే
హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను,  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

మునుగోడు లోని వివిధ మండల అధ్యక్షులు, ముఖ్య నేతల తో కలిసి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆర్టీసి, బీసీ సంక్షేమ శాఖ కు సంబంధించిన పలు  సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసి బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే కోరారు.

నియోజకవర్గానికి కొత్త బస్సులు మంజూరు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్ పనులు అప్ గ్రేడ్ చేసి, శానిటేషన్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దాంతో పాటు మునుగోడు నియోజకవర్గం లోని నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు నూతన బస్ షెల్టర్ ల నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన వినతుల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
LS కార్ప్ సంస్థతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొరియా పర్యటన సోమవారం ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన -  LS కార్ప్‌తో తెలంగాణలో పెట్టుబడులు పెట్టుటకు వారిని ఆహ్వానిస్తూ సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు మరియు అధికారులు, LS గ్రూప్ చైర్మన్  కూ జా యున్ మరియు అతని సీనియర్ నాయకత్వాన్ని కలిసి..
ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, మరియు బ్యాటరీల కోసం తెలంగాణలో తయారీ, పెట్టుబడులతో సహా విస్తృత ప్రయోజనాలపై మాట్లాడారు.

LS బృందం త్వరలో తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించనున్నట్లు, రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టుటకు వారిని తాము లాంఛనంగా స్వాగతిస్తున్నామని  సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
NLG: కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి: కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి


నల్లగొండ జిల్లా:

దేవరకొండ, మునుగోడు పరిధిలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం, డిండి లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రజల తరఫున, భూ నిర్వాసితుల తరఫున ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.