NLG: డిండి ఎత్తిపోతల పథకం పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి: నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా:
మునుగోడు: కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు నిర్ణీత కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మునుగోడు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సత్యం పాల్గొని మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం మహాబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 3.61 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2015లో జి.వో. 107 విడుదల చేసినప్పటికి గత ప్రభుత్వం డిటైల్స్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) ను ఆమోదించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకరాలేకపోవడంతో జాప్యం జరిగి ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదన్నారు.
ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందని, ఈ ప్రభుత్వమైనా నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ 300 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ డిపిఆర్ అమోదం, పర్యావరణ అనుమతులు తీసుకొని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిదంగా నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. 19 ఏండ్ల క్రితం రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి రూ.4658 కోట్ల అంచనా వ్యయానికి చేరింది. 9.5 కి.మీ. సొరంగం త్రవ్వాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం 10 ఎండ్లలో అరకొర నిధులు కేటాయించడం వలన సొరంగం పనుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతమాత్రం ముందుకు సాగ లేదన్నారు. దాంతో లిప్టు వల్ల మాత్రమే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైద్రాబాద్ త్రాగునీటికి సగం నీరు, సగం నీరు మాత్రమే సేద్యానికి ఉపయోగించడం వలన ఆయకట్టుకు నీరు అందటం లేదు. సొరంగం పూర్తయితే మాత్రమే సాగు, తాగు నీరు అందుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులు చెప్పిన విధంగా 30 నెలలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బలుగూరి నరసింహ గురిజా రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శీను సహాయ కార్యదర్శులు బండమీది యాదయ్య,మందుల పాండు, మాజి జడ్పీటిసి గోసుకొండ లింగయ్య, కార్యవర్గ సభ్యులు వనం వెంకన్న ఊపునుతుల రమేష్, ఈదులకంటి కైలాష్,మాదగోని సత్తమ్మ, కాగితం వెంకన్న మునుగోడు దయాకర్ బి లాలు దుబ్బ వెంకన్న, ఎం డి జానీ,యువజన సంఘం కార్యదర్శి బండారు శంకర్, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:

నల్లగొండ జిల్లా:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మహాత్ముడి కి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మహాత్ముడి కి నివాళులర్పించారు.
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ పంపిణి చేశారు.
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ 1 లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నల్గొండ జిల్లా:
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో గుండె నాగయ్య నిన్న అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏ ఆర్ కే మిత్ర మండలి, ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కొరకు 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.


నల్లగొండ జిల్లా:
Aug 09 2024, 13:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.9k