TG: డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు
హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్ లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపి, ఎస్ఐ లకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు.
హైదరాబాద్ లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం లో రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారుల సమావేశంలో.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటంలో కేసు దర్యాప్తు అధికారి గా ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు రాష్ట్ర డిజిపి తో పాటు పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు ప్రశంశపత్రాలను అందుకున్నారు.
ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అప్పటి స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం సిసిఆర్బి గా పనిచేస్తున్న శ్రీధర్ రావు తో పాటు, కోర్టులో పోలీస్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లారెడ్డికి, అలాగే మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన హత్య కేసులో అప్పటి మడికొండ ఇన్స్ స్పెక్టర్ ప్రస్తుతం మామనూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్, వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సత్యనారాయణ రెడ్డి తో పాటు చెన్నారావు పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో అప్పటి నర్సంపేట ఏసీపీ ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, అప్పటి చెన్నారావుపేట ఎస్.ఐ ప్రస్తుతం తొర్రుర్ ఎస్. ఐ జగదీశ్ తోపాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వాసుదేవరెడ్డి లు రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు.
ఈ సందర్బంగా ప్రశంశ పత్రాలు అందుకున్న పోలీస్ అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, ఝా, ఐపీఎస్ అభినందించారు.

హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటానికి కృషి చేసిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్ లతో పాటు గతంలో వరంగల్ లో పనిచేసిన ఏసీపి, ఎస్ఐ లకు డిజిపి చేతుల మీదుగా మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు.

నల్లగొండ పట్టణంలోని 26వ వార్డులో మంగళవారం స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ నాగుల జ్యోతి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్త ని వేరు చేయాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మర్రిగూడెం మండలంలో పర్యటించారు.
నల్లగొండ జిల్లా:
జింకల విగ్నేష్ కు రూ.15000/-, మునగపాటి లక్ష్మయ్య రూ. 27000/-, జి.అరుణ కు రూ. 60,000/- ల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాజపేట తండ మాజీ సర్పంచ్ నూన్సావత్ బిచ్చు నాయక్,యూత్ లీడర్ మారగోని సుధీర్,కాంగ్రెస్ పార్టీ నాయకుడు జింకల కొండల్ ముదిరాజ్, జింకల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం 'సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ' పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి జాతీయ వార్షికోత్సవాలు ఈ నెల 11న ఉదయం 10. గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరగనున్నాయని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలలో మర్రిగూడ మండల బహుజన, గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కొండూరు లో సేతా సత్తార్ రూ.48,000/-, దుబా యాదయ్యగిరి రూ.40,500/- మర్రిగూడ గ్రామానికి చెందిన చాట పద్మ భర్త అంజయ్య కు 30000 రూపాయలు చెక్కు, ఆంబోతు బిచ్చ నాయక్ 60000/- పగడాల చిన్న అంజయ్య కు రూ. 60000 /-, చిలువేరు శివ తండ్రి రాములు కు రూ. 28000 /- చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాయికాడికొండల్, జల వెంకయ్య, జంగయ్య,అశోక్ రెడ్డి , తన్నరు యాదయ్య,ఉడుగు ఆంజనేయులు, దండుగుల కృష్ణ, మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, మర్రిగూడ మాజీ ఎంపిటిసి వెంకటం పేట బాలయ్య, పంతంగి సుధాకర్, గ్యార యాదయ్య, పొనుగోటి శేఖర్, సిల్వర్ చంద్ర, ఎండి షాప్, గొట్టిముక్కల ప్రకాష్, పగడాల రఘు, పగడాల లింగయ్య, ఎండి అశ్వకు, ఈద రాములు, పల్ల మల్లేష్ పగడాల యాదయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఆగస్టు 6న తెలంగాణ ఉద్యమ ప్రముఖ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా, నల్లగొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆచార్య జయశంకర్ జయంతిని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని కోరారు.
Aug 07 2024, 08:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.5k