*మూసి కుడి కాలువ నీటి విడుదల ద్వారా రైతుల హర్షం..MLA -BLR*
ఈరోజు మూసి కుడి కాలువ ద్వారా పంటపొలాలకు నీటి విడుదల ను చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే గౌ,, శ్రీ వేముల వీరేశం గారు ,DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, ప్రాజెక్టు SE, EE, DE,AE , ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ * ఈ మూసి కుడి కాలువ ద్వారా *అమనగళ్ళు, కల్వేలపాలెం, చిరుమర్తి, పొరెడ్డి గూడెం, పాములపాడు, భీమనపెల్లి, లక్ష్మిదేవి గూడెం, రావులపెంట* గ్రామాలకు సాగు నీరు అందడం జరుగుతుంది.
➡️ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా సాగు నీరు అందిస్తాం ➡️ప్రతి ఎకరానికి నీరు అందజేయడమే లక్ష్యం ➡️నీటి విడుదలతో ఆయకట్టు రైతుల హర్షం వ్యక్తమవుతోంది. ➡️ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన ధన్యవాదాలు.![]()


ఈసారి బడ్జెట్‌లో సుర ప్రియులకు శుభవార్త. ఎక్సైజ్ సుంకం లేదా ఎక్సైజ్ సుంకంలో ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట మార్పులను కూడా ప్రకటించలేదు. దీంతో మద్యం ధర పెరగడం లేదని తెలిసింది. యాదృచ్ఛికంగా, మద్యం ధర మాత్రమే కాదు, సిగరెట్ సహా పొగాకు ఉత్పత్తుల ధరలను కూడా బడ్జెట్‌లో పెంచలేదు. జీఎస్టీ పెంపు వల్ల పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం చేయలేదు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ , ఏపీకి కేటాయించిన బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం అనేది చట్టంలో ఉందని కేంద్ర మంత్రి అంటూనే దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అంటే రుణాలు ఇచ్చేదే తప్ప ఉచితంగా ఇవ్వదు. మరి ఆ విధంగా ఆలోచిస్తే ఏపీకి ఇచ్చే రూ. 15000 వేల కోట్ల రూపాయల రుణమే తప్ప ఆర్ధిక సాయం ఏ మాత్రం కాదని అర్ధం అవుతోంది.
14 పెద్ద నగరాలు ఈ క్రమంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలను అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో కోటి ఇళ్లకు అర్బన్ హౌసింగ్ ప్లాన్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతోపాటు అర్బన్ హౌసింగ్ కోసం రూ.2 లక్షల కోట్లు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. PMAY అర్బన్ హౌసింగ్ 2.0 కింద రూ. 10 లక్షల కోట్ల బడ్జెట్‌తో ప్రజల గృహ అవసరాలను తీర్చనున్నట్లు ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల విలువైన సహాయాన్ని అందిస్తుందని, ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు రాయితీ ధరలను అందజేస్తుందని ఆమె తెలిపారు. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా ఒక కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందిస్తుంది. వచ్చే ఐదేళ్లలో రూ. 2.2 లక్షల కోట్ల కేంద్ర సహాయం కూడా చేర్చబడుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఈ పథకం కింద గృహాలు ఉన్నవారు, పేద తరగతి నుంచి వచ్చిన వారు ఈ ప్రయోజనాలను పొందుతారు.
Jul 26 2024, 11:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k