/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz *వారమంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. ఈ టెకీ రూటే సెపరేటు* janardhanreddy vemula
*వారమంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్.. ఈ టెకీ రూటే సెపరేటు*
Software Employee: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే చాలు లక్షల్లో జీతాలు, టీమ్ లంచ్‌లు, టీమ్ టూర్లు, లగ్జరీ లైఫ్ అని చాలా మంది భావిస్తూ ఉంటారు. వారానికి 5 రోజులు పని చేస్తే చాలు.. టెక్ ఉద్యోగాలు మిగిలిన రెండు రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది కొందరి విషయంలో కరెక్టే కానీ.. అందరి విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే ఈ టెకీ రూటే సెపరేటు. 5 రోజులు ఆఫీస్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి.. మిగిలిన రెండు రోజులు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే డబ్బులు లేక కాదు.. దాని వెనుక మరో బలమైన కారణం ఉంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అంటే ఎలా ఉంటారు. వారంలో 5 రోజుల పాటు ఆఫీస్‌లో కష్టపడి.. వీకెండ్స్‌లో పార్టీలు, పబ్‌లు, టూర్ అంటూ చిల్ అవుతూ ఉంటారు. ఇక శని, ఆది వారాలకు తోడు ఏవైనా సెలవులు ఉంటే ముందే చూసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వారంలో 5 రోజులు పడిన కష్టాన్ని.. మిగిలిన రెండు రోజులు ఎంజాయ్ చేసి.. మళ్లీ రిఫ్రెష్ అయి సోమవారం ఆఫీస్‌కు వెళ్తూ ఉంటారు.


అయితే అందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పోల్చితే ఈ టెకీ మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే వారంలో 5 రోజులు ఆఫీస్‌కు వెళ్లి.మిగిలిన రెండు రోజులు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తుతున్నాడు. అయితే ఆ ఆటోలో వెళ్లిన ఓ వ్యక్తి ఈ విషయం తెలుసుకుని దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పనిచేసే ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌కు సంబంధించిన కథ ఇది. ప్రస్తుతం ఆ మైక్రోసాఫ్ట్ టెకీ స్టోరీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. వారం మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఓ టెకీ.. వీకెండ్స్‌లో ఆటో డ్రైవర్‌గా మారుతున్నాడు. తాజాగా నమ్మ యాత్రి అనే యాప్‌లో కోరమంగళ ప్రాంతంలో ఆటో బుక్ చేసుకున్న ఓ వ్యక్తి.. ఆ ఆటో డ్రైవర్ వేసుకున్న హుడీ వెనకాల మైక్రోసాఫ్ట్ లోగో ఉండటం చూసి అతడ్ని అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తాను ఆటో డ్రైవర్‌గా ఎందుకు మారానే అనే విషయాన్ని ఆ 35 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వెల్లడించినట్లు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించాడు.
మీనాక్షి చౌదరి.. ఈ స్పిడేంటి పాప!
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చైర్ కోసం పోటీ పడుతున్న అందాల భామలలో మీనాక్షి చౌదరి, శ్రీలీల టాప్ లో ఉన్నారు.
జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే ఈ రేసులోకి దూసుకొస్తున్నారు. శ్రీలీల అందం, అభినయంతో పాటు మంచి డాన్స్ పెర్ఫార్మర్. దీంతో మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా ఆమె ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేదు. దీంతో ఇప్పుడు స్టార్ చైర్ కోసం జరుగుతున్న రేసులో వెనుకబడింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు.. సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ సినిమా అంతగా మెప్పించలేదు. తరువాత చేసిన హిట్ 2 మూవీ మంచి సక్సెస్ అయ్యింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు పెంచుకుంటూ వస్తోంది.


ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఇళయదళపతి విజయ్ కి జోడీగా GOAT అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగులో దుల్కర్ సల్మాన్ కి జోడీగా లక్కీ భాస్కర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. లక్కీ భాస్కర్ మూవీపైన పాజిటివ్ వైబ్ ఉంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రానుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ కి జోడీగా చేసిన మెకానిక్ రాకీ మూవీ రాబోతోంది. షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. మెగాస్టార్ పాన్ ఇండియా మూవీ విశ్వంభరలో ఓ కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

ఈ మూవీ కూడా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలాగే వరుణ్ తేజ్ కి జోడీగా మట్కా మూవీలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఆమె ఖాతాలో ఆరు సినిమాలు ఉంటే అందులో 4 మూవీస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రాబోతుండటం విశేషం. ఇవి సక్సెస్ అయితే మీనాక్షి చౌదరి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ చైర్ లో కూర్చుంటుంది. అటు సీనియర్ హీరోలకి, ఇటు యంగ్ హీరోలకి సెట్ అయ్యే గ్లామర్ ఉండటంతో మీనాక్షి చౌదరికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు.


పోస్టుల వివ‌రాలు.
క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22). ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.
*ఊహించని కాంబోతో సమంతా వెబ్ సిరీస్*
ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న సమంతా తిరిగి ఎప్పుడు తెరమీద కనిపిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య స్వంత నిర్మాణంలో మా ఇంటి బంగారం ప్రకటించి చిన్న పోస్టర్ వదిలింది తప్ప అంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి కథలు వింటున్న సామ్ చేతికి ఒక ఇంటరెస్టింగ్ కాంబో వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డికె త్వరలో రక్త్ భ్రమండ్ పేరుతో ఒక హారర్ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. దర్శకత్వం వీళ్ళు చేయడం లేదు.
2018లో తుంబాడ్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రహి అనిల్ భర్వేకి డైరెక్షన్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇది నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోతున్నారు. వచ్చే ఏడాది 2025 ఆగస్ట్ స్ట్రీమింగ్ టార్గెట్ గా పెట్టుకుని నిర్మాణం చేస్తారని తెలిసింది. భారీ బడ్జెట్ తో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని బ్యాక్ డ్రాప్ ని ఇందులో పరిచయం చేస్తారు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో పాటు ఊహకందని మలుపులతో ఒక కొత్త అనుభూతిని రక్త్ భ్రమండ్ ఇస్తుందని యూనిట్ టాక్. సమంతాతో పాటు సిద్దార్థ్ రాయ్ కపూర్, వామికా గబ్బిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


టైటిల్ తోనే భయపెట్టడం చూస్తుంటే కంటెంట్ నిజంగానే షాకింగ్ గా ఉండేలా కనిపిస్తోంది. రాజ్ అండ్ డీకేలు తెలుగు వాళ్లే అయినప్పటికీ ఇండియన్ ఓటిటి స్పేస్ లో తమదైన జెండా ఎగరేస్తున్నారు. సామ్ తోనే తీసిన సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గన్స్ అండ్ గులాబ్స్ కు వచ్చిన స్పందన చూసి నెట్ ఫ్లిక్స్ ఈ దర్శక ద్వయాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రైమ్ కోసం ఫ్యామిలీ మ్యాన్ 3 తీస్తున్న రాజ్ అండ్ డీకే మరోపక్క ఇతర సిరీస్ ల ప్రొడక్షన్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. రక్త్ భ్రమండ్ లో సమంతా పాత్ర తీరుతెన్నులు కెరీర్ బెస్ట్ అనిపించేలా ఉంటాయట
తెలుగు రాష్ట్రాలకు కుండపోత వర్ష సూచన.. అక్కడ అతి భారీ వర్షాలు!
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. 4 రోజులపాటూ దక్షిణాది రాష్ట్రాల్లో చురుగ్గానే ఉంటాయి. దక్షిణాది వైపు వంగి ఒక ద్రోణి ఉంది. గుజరాత్, కేరళ దగ్గర మరో ద్రోణి ఉండి, గాలుల్నీ, మేఘాల్నీ ఏపీ, తెలంగాణవైపు పంపుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం అలాగే ఉంది. రెండ్రోజుల్లో అది ఒడిశా తీరంవైపు వస్తుంది. అరేబియా సముద్రంలో ఓ తుఫాను ఏర్పడుతోంది. కారణాల వల్ల వచ్చే 5 రోజులపాటూ.. ఉరుములు, మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. 18, 19 తేదీల్లో కోస్తా, యానంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
18 నుంచి 20 వరకూ తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 20 వరకూ కోస్తా, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే 18 నుంచి 21 మధ్య తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.





ఇదీ IMD చెప్పిన అధికారిక సమాచారం శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. శాటిలైట్స్ లైవ్ అంచనాల్ని గమనిస్తే, కోస్తా నుంచి విశాఖపట్నం, ఒడిశా వరకూ ఒక సర్కిల్ లాంటిది తిరుగుతోంది. దాని వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణలో ఇవాళ రోజంతా వర్షాలు పడుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి పడుతున్న వాన, ఇవాళ మధ్యహ్నం 12 వరకూ పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం కాకినాడ పరిసరాల్లో అతి భారీ వర్ష సూచన ఉంది. ఇంతలా వానలు పడుతున్నా.





ఇవాళ రాయలసీమలో కొంత వేడిగానే ఉంటుంది. దక్షిణ రాయలసీమలో వేడి ఫీలింగ్ ఉంటుంది. ఏపీలో ఓవరాల్‌గా యావరేజ్ వేడి 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో ఇవాళ చల్లగానే ఉంటుంది. తేమ బాగా ఉంది. ఏపీలో యావరేజ్‌గా 89 శాతం, తెలంగాణలో 81 శాతం ఉంది. ఉత్తర తెలంగాణలో 93 శాతం, ఉత్తరాంధ్రలో 94 శాతం, కోస్తాంధ్రలో 90 శాతం తేమ ఉంది. కానీ రాయలసీమలో 51 శాతమే ఉంది. అందుకే సీమలో ఇవాళ వానలు పడేలా లేవు. మొత్తంగా రెండు రాష్ట్రాల ప్రజలూ ఇవాళ జాగ్రత్తలు తీసుకోవాలి. పిడుగులతో అప్రమత్తంగా ఉండాలి.
*తెలంగాణలో మహిళా సాధికారతను కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్వచించింది: ఉత్తమ్*
*మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి ఉత్తమ్*
*కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత మరియు సాధికారతకు కట్టుబడి ఉంది. ఉత్తమ్  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతను పునర్నిర్వచించిందని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమలు చేస్తున్న పథకాల్లో ఎక్కువ భాగం మహిళా సాధికారతపై దృష్టి సారించినవేనని ఆయన పేర్కొన్నారు.*

బుధవారం బుద్ధభవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ప్రమాణ స్వీకారోత్సవంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్న పథకాలను వివరించారు.
*వరుసపెట్టి ప్రభుత్వ బ్యాంకుల శుభవార్త.. మరో దిగ్గజ బ్యాంక్ 4 స్పెషల్ స్కీమ్స్* .కస్టమర్లకు అధిక వడ్డీతో..!
బ్యాంకుల్లో మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు వరుసగా శుభవార్తలు ప్రకటించాయి.
3 ప్రభుత్వ బ్యాంకులు ఒకేరోజు వీటి గురించి ప్రకటన చేయడం విశేషం. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తర్వాత ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ఎస్బీఐ అమృత్ వృష్టి పేరిట 444 రోజుల టెన్యూర్‌తో స్పెషల్ ఎఫ్డీ తీసుకురాగా.
తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్సూన్ ధమాకా పేరుతో రెండు వేర్వేరు కాలవ్యవధులతో ప్రత్యేక పథకాల్ని ప్రవేశపెట్టాయి. అయితే తర్వాత ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రం 4 ప్రత్యేక పథకాల్ని ఒకేసారి లాంఛ్ చేసింద.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషల్ స్కీమ్స్ ఈ బ్యాంకు 200 రోజులు, 400 రోజులు, ఇంకా 666 రోజులు, 777 రోజుల కాల పరిమితులతో ప్రత్యేక డిపాజిట్ స్కీమ్స్ లాంఛ్ చేశాయి. ఇంక టెన్యూర్ పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేట్లు పెరుగుకుంటూ వచ్చాయని చెప్పొచ్చు.





200 రోజుల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 6.9 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.ఇదే సమయంలో 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై ఈ బ్యాంకు 7.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 666 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 7.15 శాతం వడ్డీ అందిస్తుండగా.. ఇదే సమయంలో 777 రోజుల డిపాజిట్ పథకానికి ఏకంగా 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక ఈ వడ్డీ రేట్లు జులై 8 నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. ఇక సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఎస్బీఐలో ఇప్పటికే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ అమృత్ కలశ్ ఉండగా.. దీంట్లో సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజెన్లకు వరుసగా 7.10 శాతం, 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండేది. ఇప్పుడు అమృత్ వృష్టి పథకానికి మాత్రం 444 రోజుల వ్యవధికిగానూ వరుసగా 7.25 శాతం, 7.75 శాతం వడ్డీ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా విషయానికి వస్తే.రెండు వేర్వేరు కాలవ్యవధులతో ఎఫ్‌డీ స్కీమ్స్ ప్రవేశపెట్టింది. 333 రోజులకు డిపాజిట్ చేస్తే సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 7.65 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 399 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ వస్తుంది.
4 వ రోజు మిర్యాల పట్టణంలోని నేను నా మిర్యాలగూడ *ఎమ్మెల్యే* *బత్తుల లక్ష్మారెడ్డి *( B L R)
B L R గారి ఆదేశాల మేరకు 30 వ వార్డ్ బంగారుగడ్డ లో స్వచ్ఛంద పారిశుద్ధ్య కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇంచార్జ్ *ఆలగడప గిరిధర్* గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు వార్డు ఇన్చార్జులు నాయకులు కార్యకర్తలు కలిసి వార్డు లోని డ్రైనేజీలను పరిసరాలను పరిశుభ్రంగా చేయడమే కాక మోరి లో తీసిన షీల్డ్ ను చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్టర్లు మున్సిపల్ వాహనాల్లో డబ్బింగ్ యార్డ్ కి పంపించడం జరిగింది.
30 వ వార్డు ఇంచార్జ్ *ఆళ్లగడప గిరిధర్ వర్షాన్ని సైతం* లెక్కచేయకుండా మున్సిపల్ సిబ్బందిని వార్డ్ నాయకులను ఇన్చార్జిలను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ నేను నా మిర్యాలగూడ స్వచ్ఛ సేవా కార్యక్రమం విజయవంతంగా ముగించడం జరిగింది . అనంతరం బ్లీచింగ్, ఫాగింగ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జిలుగ కౌన్సిలర్లు ఎస్.కె జావిద్, చిలుకూరి బాలకృష్ణ , గోదాల జానకిరామిరెడ్డి, పాతూరి శరత్, సోమగాని శ్రీనివాస్, గొట్టిముక్కల లక్ష్మణ్ మరియు తాండవ కృష్ణ , పగిళ్లసత్యం, గోగుకొండలు, నాగుల్ మీరా, పందిరి సైదులు, కంచర్లకిరణ్ ,జిల్లా నవీన్ ,సందీప్, కామాజి వెంకన్న , దుండిగాల సోమయ్య సజ్జత్ , ఉబేద్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

*అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి
ఈరోజు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని *అంగన్వాడీ కేంద్రాన్ని* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.పిల్లలకు మరియు గర్భిణీ మహిళలకు అందాల్సిన పౌష్టిక ఆహార పదార్థాలు సక్రమంగా వారికి అందజేయాలని సూచించారు .. అలాగే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతో పాటు వారికి అక్షరాలు నేర్పించే మొదటి గురువులు అంగన్వాడీ టీచర్స్ కాబట్టి వారికి బడి వాతావరణ అలవాటు అయ్యేలా వారిని చూసుకోవాలి అని అన్నారు.
అనంతరం పిల్లలతో కలసి అక్షరాలు దిద్ధించారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*ఇవాళ నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారo*
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.