/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం ఇడికుడ గ్రామంలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ..సాంప్రదాయక స్వాగతం పలికిన ముస్లిం సోదరులు.
శివన్నగూడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మర్రిగూడ మండలం, శివన్నగూడ గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆవుల చిన్న జంగయ్య మరియు బొంత మంగమ్మ కు పంపిణీ చేసిన శివన్నగూడ శ్రీ నీలకంఠ రామస్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు యాదగిరి, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి
మేతరి యాదయ్య, దేవాలయ ధర్మకర్త చిట్యాల రంగారెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ వాయిల సోమయ్య, మండల కాంగ్రెస్ నాయకులు నందికొండ లింగారెడ్డి, శివన్నగూడ గ్రామ పెద్దలు ఇరగదిండ్ల సత్తయ్య, అయితగోని వెంకటయ్య, నల్లవోతు కొమురయ్య, జిల్లాగోని నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.
SB NEWS TELANGANA
SB NEWS NLG
NLG: చెత్తను వేరు చేయాలని ఇంటింటి ప్రచారం
నల్లగొండ: మున్సిపాలిటీ పరిధిలో ఐటీసీ చీఫ్ మేనేజర్ ఉమాకాంత్ మరియు మారి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మురళి సహకారంతో వావ్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాలంటీర్లను ఎంపిక చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి చెత్తను మూడు భాగాలుగా విభజించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని తెలిపారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు, తడి చెత్త మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయవచ్చని, హానికరమైన చెత్త విద్యుత్ తయారికి ఉపయోగపడుతుందని తెలిపారు. మంగళవారం, శుక్రవారం పొడి చెత్తను సేకరిస్తున్నట్లు.. మిగతా రోజుల్లో తడి చెత్త, హానికరమైన చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి పాల్గొన్నారు.
NLG: మొహర్రం వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
నల్లగొండ పట్టణం ఓల్డ్ సిటీ లో ఇవాళ జరిగిన మొహర్రం వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ఇంతియాజ్, సమద్, మాజీ కౌన్సిలర్ సట్టు శంకర్, ఇంతియాజ్, 12 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మామిడి కార్తీక్, హన్ను, తదితరులు పాల్గొన్నారు.
NLG: 14వ వార్డులో ఘనంగా పీర్ల ఊరేగింపు
నల్లగొండ: ఈరోజు ముస్లింల పండగ మొహర్రం ను పురస్కరించుకొని మర్రిగూడ గ్రామం 14 వ వార్డ్ లో పీర్లను ఊరేగింపు కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మర్రిగూడ గ్రామవాసి మందడి నర్సిరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శాఖ వారు పాల్గొని పీర్లను (సవార్లను) ఎత్తుకొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 14 వ వార్డ్ కౌన్సిలర్ బొజ్జ శంకర్ మరియు ముస్లిం నాయకులు గ్రామ ప్రజలు కుల మతాలకు అతీతంగా అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.
SB NEWS TELANGANA
ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటియుసి కార్యదర్శి
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం నల్లగొండలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి శ్రమదోపీడి అరికట్టాలని కోరారు. అంగన్వాడీలకు నెలకు రూ.18000 వేతనం వెంటనే అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు ఇవ్వాలని, కనీస వేతన చట్టాలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వము మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గత ఎన్నికల్లో బలపరచి గెలిపించారని, ఆ నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వెంటనే చేపట్టాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల గ్రామపంచాయతీ కార్మికుల, రెండవ ఏ ఎన్ ఎం ల వేతనాలు తక్షణమే పెంచాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను ప్రక్షాలన చేసి నిజమైన లబ్ధిదారులకు కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని, సాఫ్ట్వేర్ విధానంలో ఆన్లైన్ విధానంలో మార్పులు తీసుకొని రావాలని కోరారు. కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఏఐటియుసి అండగా నిలిచి పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, సహయ కార్యదర్శి డోటి వెంకన్న, ఎండీ సయీద్, నూనె వెంకటేశ్వర్లు కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
దామర భీమన పల్లి : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను అందజేసిన మాజీ సర్పంచ్
NLG: మర్రిగూడ మండలం, దామర భీమన పల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో, గ్రామానికి చెందిన చెక్క రాములమ్మ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ 27000/- ను, ఇవాళ గ్రామ మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా రాములమ్మ కు అందజేశారు. కార్యక్రమంలో మునగాల జగాల్ రెడ్డి, జిల్లా కృష్ణయ్య, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, అయితరాజు పాపయ్య, మునగాల అంతిరెడ్డి, ఒంటెద్దు వెంకట్ రెడ్డి, చిలువేరు నరేష్, చెక్క సురేష్, జిల్లా శంకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
TG: రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 56 కోట్ల వ్యయంతో బాలానగర్ - గంగాపూర్ రహదారి విస్తరణ పనులకు (సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్) శంకుస్థాపన చేసిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Jul 18 2024, 11:40