NLG: చెత్తను వేరు చేయాలని ఇంటింటి ప్రచారం
నల్లగొండ: మున్సిపాలిటీ పరిధిలో ఐటీసీ చీఫ్ మేనేజర్ ఉమాకాంత్ మరియు మారి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మురళి సహకారంతో వావ్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వాలంటీర్లను ఎంపిక చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి చెత్తను మూడు భాగాలుగా విభజించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని తెలిపారు. ఇలా చెత్తను వేరు చేయడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు, తడి చెత్త మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయవచ్చని, హానికరమైన చెత్త విద్యుత్ తయారికి ఉపయోగపడుతుందని తెలిపారు. మంగళవారం, శుక్రవారం పొడి చెత్తను సేకరిస్తున్నట్లు.. మిగతా రోజుల్లో తడి చెత్త, హానికరమైన చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి పాల్గొన్నారు.
Jul 17 2024, 21:58