NLG: ఘనంగా రిటైర్డ్ లెక్చరర్ పేర్ల వీరయ్య పెద్దకర్మ
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జియాలజీ విభాగంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది, ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడానికి కృషిచేసిన రిటైర్డ్ లెక్చరర్, కీర్తిశేషులు పేర్ల వీరయ్య గారి పెద్దకర్మ ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన పూర్వపు రిజిస్టార్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి, మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ప్రేమ్ సాగర్, డాక్టర్ జి. మచ్చెందర్, డాక్టర్ బిక్షమయ్య, డాక్టర్ చింత శ్యామ్, జి. సుధాకర్, వీరస్వామి, సత్యనారాయణరెడ్డి, షరీఫ్ మరియు ఎన్జీ కాలేజీ ఇన్చార్జి హెడ్ జియాలజీ విభాగం ఇంద్రకంటి చంద్రయ్య మొదలగు వారు పాల్గొని తమ ఆరాధ్య దైవమైన గురువు వీరయ్య సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరయ్య సార్ ఎన్జీ కళాశాలలో సుదీర్ఘకాలంగా జియాలజీ విభాగంలో లెక్చరర్ గా, హెచ్ ఓ డి గా, పనిచేసి విద్యార్థులకు జియాలజి సులభంగా అర్థమయ్యేలా బోధించి, విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడే విధంగా కృషి చేశారని, ఆయన సేవలను కొనియాడారు.
SB NEWS TELANGANA
Jul 17 2024, 17:41