లెంకలపల్లి: బెల్టు షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, ఏర్పుల శ్రీశైలం, నందికొండ లింగారెడ్డి, చాపల రవి, అయితగోని వెంకటయ్య, మేతరి శంకర్, దాసరి వెంకన్న, లింగయ్య, హరీష్, , వెంకటయ్య, యాదయ్య, నాగరాజు, శ్రీను, గిరి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు. 
SB NEWS TELANGANA
SB NEWS NLG
Jul 08 2024, 20:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.4k