తిరుపతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో పోస్టల్ శాఖ ఏబిపిఎం పగిళ్ల తిరుపతయ్య ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుపతయ్య దశదిన కర్మ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు వెంకటమ్మ, రాజశేఖర్, ఖన్నా లు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య కార్యక్రమంలో పాల్గొని తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్, లెంకలపల్లి ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, చాపల రవి, పెంబల్ల గిరి, నందికొండ లింగా రెడ్డి, మేతరి శంకర్, తదితరులు ఉన్నారు. 
Jun 23 2024, 22:06