రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించనున్న చంద్రబాబు
![]()
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది..
2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.
అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్‌లను పరిశీలిస్తారు.
ఐదేళ్లపాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్.. భవనాలను పాడుబెట్టారని దుయ్యబట్టారు. 70.. 80శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైకాపా ప్రభుత్వం వదిలేసిందన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు.










Jun 19 2024, 17:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.0k