దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ..!
•నేడే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు
- 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఈ సారి 400 సీట్లు సాధించాలన్న మోదీ లక్ష్యానికి దగ్గరగా ఎన్డీయే కూటమి సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దని ఇండియా కూటమి చెబుతోంది.
అంచనాకు మించిన ఫలితాలతో అధికారాన్ని దక్కించుకోబోతున్నట్టు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చెబుతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేక జనాల తీర్పు మరోలా ఉంటుందా?.. అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకనుంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు కోకిల డిజిటల్ మీడియా అందిస్తోంది.
మరికాసేపట్లో దేశవ్యాప్తంగా మొత్తం 452 లోక్‌సభ స్థానాలకు మొదలు కానున్న కౌంటింగ్.
నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాతే ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపును మొదలెట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నిర్దేశించిన సమయానికే ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించాలి.
కంట్రోల్ యూనిట్ల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. పేపర్ సీల్ చెదిరిపోకుండా చూసుకోవాలి.
అనంతరం మొత్తం పోలైన ఓట్లను, ఫారం 17సీలో పేర్కొన్న సంఖ్యతో సరిపోల్చుకోవాలి.
కేంద్రంలో అధికార పీఠం ఎవరిదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రజలు, రాజకీయ పార్టీల ఉత్కంఠకు తెరపడనుంది. వరసగా మూడోసారి, రికార్డు విజయంపై ప్రధాని మోదీ కన్నేయగా.. ప్రతిపక్ష ఇండీ కూటమి అనూహ్యంగా తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది.
Jun 04 2024, 08:37