లింగ నిర్ధారణకు చేయిస్తే కఠిన చర్యలు
వరంగల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డా వెంకటరమణ డిఎంహెచ్వో అధ్యక్షతన పిసిపిఎన్డిటి జిల్లా అడ్వైజరీ కమిటీ మీటింగ్
నిర్వహించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
డా వెంకటరమణ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కేంద్రాలను తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని స్కానింగ్ మిషన్ సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ లో పొందుపరచుకోవాలని తెలిపినారు.
గర్భిణీ స్త్రీలకు చేసే గర్భస్థ పరీక్షలు గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నదా ఏమైనా అంగవైకల్యంగా ఉన్నదా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలన్నారు.
కానీ కొందరు లింగ నిర్ధారణ చేస్తున్నారని దాని ద్వారా సమాజానికి విఘాతం కలుగుతుందని తెలిపినారు.ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఈ గర్భస్థ లింగ నిర్ధారణ చేసి ఆడ, మగ అని తెలిపిన అనవసరమైన అబార్షన్లు చేసిన వారిపైన చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
May 27 2024, 13:32