/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz AP Election:పిన్నెల్లి విధ్వంసం సీఈఓ పై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 గంటల లోపు..! Yadagiri Goud
AP Election:పిన్నెల్లి విధ్వంసం సీఈఓ పై ఎన్నికల సంఘం సీరియస్.. సాయంత్రం 5 గంటల లోపు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది..

ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు ఎన్నికల కమిషన్ తాఖీదు పంపింది. పాల్వాయి గేట్‌లో ఈవీఎం ధ్వంసం సంఘటనపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం అడిగింది.

అసలేం జరుగుతోంది..?

సీసీ ఫుటేజీలో ఉన్నది.. ఘటనలో పాల్గొన్నది ఎమ్మెల్యేనా.. కాదా..? అని సీఈసీ ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే కేసు ఎందుకు పెట్టలేదు..? అని సీఈవోపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా..? లేదా.. నిందితుడిగా చేర్చి ఏంటే అరెస్ట్ చేశారా..? లేదా అని ముఖేష్ కుమార్‌ను సీఈసీ నిలదీసింది. ఇప్పటి వరకూ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని క్లియర్ కట్‌గా సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటలలోపు ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ముకేశ్‌కుమార్ మీనాను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లుగా తెలియవచ్చింది. దీంతో ఏం జరుగుతుందో ఏమో అని ఇటు పిన్నెల్లి బ్రదర్స్.. అటు వైసీపీలో టెన్షన్ నెలకొం

పోలింగ్ రోజు జరిగింది ఇదీ..?

రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్‌ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్‌ బయటే గొడ్డలితో దాడి చేశారు..

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Tirumala: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు..

అనంతరం.. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రేవంత్‌రెడ్డి. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

రంగనాయకుల మండపంలో రేవంత్‌ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేయగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్‌రెడ్డి..

స్వామివారిని దర్శించుకున్న అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ''కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయి. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించా. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి'' అని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు..

నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం..

24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 

ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. 

నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం.. 

5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.

మేడారం ఆలయ అధికారులు కీలక ప్రకటన

మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు.

స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీల్లో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఆదివారం వెల్లడించారు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్‌లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.

ఇందులో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం అధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలం, భవనం అప్పగించాలని పూజారులు డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు వినతిపత్రాలిచ్చినా స్పందన లేకపోవడంతో గద్దెలు, ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు ఆదివారం తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ లో ఎదురుకాల్పులు .. జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి..

ఈ కాల్పుల ఘటనలో ఓ జవాను మృతి చెందగా.. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అడవిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు..

ఈ క్రమంలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ మృతి చెందగా.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జవాను పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది..

బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించోద్దు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

లోకసభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున రాష్ట్రంలో సమగ్ర కులగనణ చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామిమేరకు సమగ్ర కులగణన చేపట్టాలన్నారు. కులగణన చేపట్టడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేసి కులగణన చేపట్టడానికి రూ 150 కోట్ల బడ్జెట్ ను కూడా విడుదల చేసిందని గుర్తుచేశారు.

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగిసినందున తక్షణమే ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ఎన్నికలకు ముందే విడుదల చేసిన జీవో 26 ప్రకారం తక్షణమే కులగణన ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన చేపట్టిన తర్వాతనే గ్రామపంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. కులగణన లేకుండా, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీలు ఆర్థికంగా లేరనే నెపంతో గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వలేదని, కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయిన బీసీలు పోటీ చేయడానికి అవకాశం రావాలంటే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరిగేవని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మూలం గా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గాయన్నారు.

బీసీలకు అన్యాయం చేసిన పాపానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి, బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చినందున తక్షణమే కులగణన చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఆధారంగా అదేవిధంగా ఇతరత్రా లెక్కల ఆధారంగా ఎన్నికలకు వెళితే న్యాయ పరమైన చిక్కులు ఏర్పడి బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా పెంచకపోయే ప్రమాదం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే శాస్త్రీయబద్ధంగా బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని ఇందుకు ఒకటి రెండు నెలల్లోనే బీసీ కులగణన మొత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, గండిచెర్వు చంద్రశేఖర్, అనిల్ చెర్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

ఆదివారం నాడు హార్డ్ ల్యాండింగ్‌కు గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్నారని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

'ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం. కానీ, పరిస్థితి అంత బాగోలేదు' అని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం, ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలుదేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది..

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు..

వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు..

Streetbuzz News

నేడే CSK vs RCB రణరంగం !

ఐపీఎల్-2024 (IPL 2024) ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్క స్థానమే. దాని కోసం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

నేడు సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్న ఈ రెండు జట్లలో.. ఏదైతే విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే.. రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా బీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. ఆర్సీబీ రన్‌రేట్ 0.387గా ఉంది. అది మెరుగుపడాలంటే, రెండు సమీకరణాలు ఉన్నాయి.

ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే.. 200 పరుగులకు మించి స్కోరు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క పరుగు తేడాకొట్టినా.. అంటే 17 పరుగులతో విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు చెన్నై ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్‌కి చేరిపోతుంది. ఆర్సీబీ ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. దాన్ని ఆర్సీబీ 11 బంతులు మిగిలి ఉండగానే ఛేధించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక బంతి తేడాకొట్టినా.. ఆర్సీబీ గెలిచినప్పటికీ ఇంటిబాట పట్టక తప్పదు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని 18.1 బంతుల్లో తప్పకుండా ఛేంజ్ చేయాలి. మరి.. ఆర్సీబీకి ఇది సాధ్యమవుతుందా? లేదా?

ఒక రకంగా చెప్పాలంటే.. ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ చోటు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆర్సీబీతో పోలిస్తే చెన్నైకే ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రెండు సమీకరణాల్ని ఆర్సీబీ అందుకోకపోతే.. చెన్నై ఓడినా సింపుల్‌గా ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోతుంది. ఈ లెక్కన.. అద్భుతం జరిగితే కానీ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరదు. మరి.. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ఎవరెలా రాణిస్తారో చూడాలి.

కాళేశ్వరం ప్రోజెక్ట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష !

- మైంటైన్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలపై దృష్టి

- పంపుల సమీక్షపై కొనసాగుతున్న చర్చ

- మేడిగడ్డ బ్యారేజ్ పై రేవంత్ రెడ్డి ఫోకస్

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది.

ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు చేపట్టాల్సిన మరమత్తులపై కీలక చర్చ నిర్వహించనున్నారు. ఇవాళ్టి సమావేశంలో మరమత్తులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ అధ్వర్యంలో నియమించిన ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తన్నారు.