కాళేశ్వరం ప్రోజెక్ట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష !
- మైంటైన్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలపై దృష్టి
- పంపుల సమీక్షపై కొనసాగుతున్న చర్చ
- మేడిగడ్డ బ్యారేజ్ పై రేవంత్ రెడ్డి ఫోకస్
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది.
ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు చేపట్టాల్సిన మరమత్తులపై కీలక చర్చ నిర్వహించనున్నారు. ఇవాళ్టి సమావేశంలో మరమత్తులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ అధ్వర్యంలో నియమించిన ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తన్నారు.
May 18 2024, 13:37