ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి ,జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఐకెపి, సొసైటీ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం స్థానిక శాసనసభ్యులు తగిన విధంగా స్పందించి వడ్లును కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా బాధ్యత తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేసినారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భువనగిరి మండలం ఐకెపి (వడ్ల కొనుగోలు కేంద్రం) ని సందర్శించిన అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతూ భువనగిరి మండల తహిశీల్దార్ అంజిరెడ్డి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఆరు కాలము కష్టపడి కరువులో బోరుబావులు అడగండి సగం చేండ్లు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలతో ఉన్న కాస్త పండిన పంటను కోసి ధాన్యాన్ని మార్కెట్ కు తెచ్చి 60 రోజులు గడుస్తున్న సరిగా కొనుగోలు చేయక వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే నాధుడే కరువయ్యాడని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. గత పాలకులు రైతులను ఇబ్బంది పెడితే నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని అనేక మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని సరిగా కొనటం లేదని ప్రశ్నించారు. రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లా కలెక్టర్ యంత్రాంగం, ఓట్లు వేసుకుని గద్దెనెక్కిన శాసనసభ్యులు ఎందుకు మార్కెట్లను సందర్శించి రైతుల బాధలను తీర్చడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని మార్కెట్ కేంద్రాలలో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లారీల కొరతను, గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని, తరుగు పేరుతో క్వింటాకు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న దానిని అరికట్టాలని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు రైతుల బాధలు పట్టించుకోని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య , అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లెపల్లి కుమార్, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి, అనాజపురం శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేష్, నాయకులు గంగనబోయిన బాల నరసింహ, బొల్లెపల్లి స్వామి, బొల్లెపల్లి కిషన్, కడారి కృష్ణ , పిట్టల శ్రీశైలం, కడ మంచి రవి, అంజయ్య , రైతులు శ్రీరామ్ శ్రీశైలం , పున్నమ్మ, యాదయ్య, పోషయ్య తదితరులు పాల్గొన్నారు.
![]()

నల్లగొండ,ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్ట కాలంలో సామాన్య ప్రజలను విద్యార్థులను అన్ని విధాలా ఆదుకున్న ప్రజా సేవకుడు తీన్మార్ మాల్లన్న అని కొనియాడారు తనకున్న యావదాస్తిని సైతం ప్రభుత్వంకు ఇచ్చిన ఏకైక నాయకుడు మల్లన్న మాత్రమేనన్నారు నిరుద్యోగులకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడి చొరవ తీసుకుంటాడని పేర్కొన్నారు సమస్యలన్నీ పరిష్కారo కావాలంటే పట్ట బద్రులైన విద్యార్థులు,ఉద్యోగులు,ఉపాద్యాయులు, అధ్యాపకులు,ప్రభుత్వ,ప్రయివేటు సoస్థల్లో పనిచేసే పట్ట బద్రులందరూ కలిసి తీన్మార్ మల్లన్నకు ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టదా!! ప్రజల ఓట్లు వేయించుకోవడమే కాదు!! రైతుల గోస కూడా పట్టించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా మార్కెట్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు రైతుల గోస ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టదా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో రైతులను ప్రభుత్వం తీవ్రమైన మోసం చేస్తుందన్నారు రైతులు పండించిన పంటకు 'ఏ గ్రేడ్' ఇవ్వకుండా 'బి గ్రేడ్' కింద కొనుగోలు చేయడం రైతాంగానికి తీవ్రమైన అన్యాయమన్నారు వెంటనే బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఒకవైపు ప్రభుత్వం, వాతావరణ శాఖ వర్షాలు రాబోతున్నాయని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక గ్రామాల్లో దాన్యం కుప్పలు, కుప్పలుగా కొనుగోలు జరపకుండా మిగిలిపోయిందన్నారు అకాల వర్షాలు వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలని లారీల కొరతను,గన్ని బ్యాగుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల మధ్య సరైన సయోధ్య లేకపోవడంతో ఇద్దరి మద్య రైతులు నష్టపోతున్నారన్నారు తరుగు పేరుతో క్వింటాల్ కు 5 కిలోల చొప్పున మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ప్రభుత్వానికి తెలియదా?? అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వెంటనే ఏలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, మెరుగు వెంకటేశం, వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కలుకూరి ముత్యాలు, కందడి సత్తిరెడ్డి,SFI జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు,సిపిఎం మండల నాయకులు వేముల నాగరాజు,కొమ్ము స్వామి,దయ్యాల సత్యరాములు, కందగట్ల సాయిరెడ్డి,వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.
దొంగలు బాబోయ్ దొంగలు*.... *సెల్ ఫోన్లు, పర్సులు, బైకులు మాయం* *పట్టించుకోని అధికారులు* *సీ సీ కెమెరాలు, పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ నిత్యం ముప్పై నుంచి నలబై వేల మంది ప్రయాణికులతో నిండి ఉండే భువనగిరి బస్ స్టేషన్లో దొంగల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం తో మహిళల రద్దీ ఎక్కువ అవడంతో దొంగలు, తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. గత మూడు నెలల కాలంలోనే ముప్పై కి పైగా దొంగ తనాలు కేవలం భువనగిరి బస్ స్టేషన్ లోనే జరిగాయని తెలుస్తోంది. చాలా మంది బాధితులు పోలీసులకు పిర్యాదు చేయకుండానే వెళుతున్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్ అందుబాటులో లేకపోవడం, పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటారనే నమ్మకం లేకపోవడం, బస్ స్టేషన్ లో పోలీస్ ఔట్ పోస్ట్ లేకపోవడం వల్ల బాదితుల పిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అద్దెల రూపంలో ప్రతి నెల పది లక్షల రూపాయిల ఆదాయం ఉన్నా, ఆర్టీసీ అధికారులు కనీసం ఇద్దరు హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే, ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక్క సీ సీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం గమనార్హం. *ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలి* కొడారి వెంకటేష్ *వినియోగదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు* భువనగిరి బస్ స్టేషన్ లో తగినన్ని సీసీ కెమెరాలు, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారినుండి ప్రయాణికులను రక్షించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. భువనగిరి బస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా ఆటోలు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. సురేపల్లి తండా సర్పంచ్ (కుమారుడు) కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో తరలిన గిరిజన రైతులు. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలనీ కోరారు.
May 17 2024, 17:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.9k