/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz యాదాద్రి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన Vijay.S
VijayaKumar

May 15 2024, 14:46

యాదాద్రి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నిరసన
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిరసన చేపట్టారు.

VijayaKumar

May 14 2024, 18:45

భువనగిరి బస్ స్టేషన్ లో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు


దొంగలు బాబోయ్ దొంగలు*.... *సెల్ ఫోన్లు, పర్సులు, బైకులు మాయం* *పట్టించుకోని అధికారులు* *సీ సీ కెమెరాలు, పోలీసు ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్ నిత్యం ముప్పై నుంచి నలబై వేల మంది ప్రయాణికులతో నిండి ఉండే భువనగిరి బస్ స్టేషన్లో దొంగల బెడద రోజు రోజుకు పెరిగి పోతుంది. నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం తో మహిళల రద్దీ ఎక్కువ అవడంతో దొంగలు, తమ పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నారు. గత మూడు నెలల కాలంలోనే ముప్పై కి పైగా దొంగ తనాలు కేవలం భువనగిరి బస్ స్టేషన్ లోనే జరిగాయని తెలుస్తోంది. చాలా మంది బాధితులు పోలీసులకు పిర్యాదు చేయకుండానే వెళుతున్నారు. ప్రధానంగా పోలీసు స్టేషన్ అందుబాటులో లేకపోవడం, పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటారనే నమ్మకం లేకపోవడం, బస్ స్టేషన్ లో పోలీస్ ఔట్ పోస్ట్ లేకపోవడం వల్ల బాదితుల పిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అద్దెల రూపంలో ప్రతి నెల పది లక్షల రూపాయిల ఆదాయం ఉన్నా, ఆర్టీసీ అధికారులు కనీసం ఇద్దరు హోం గార్డులను నియమించుకునే స్థితిలో లేరంటే, ప్రయాణికుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక్క సీ సీ కెమెరా ఉండడం, అది కూడా పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం గమనార్హం. *ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరచాలి* కొడారి వెంకటేష్ *వినియోగదారులు సంఘం జిల్లా అధ్యక్షుడు* భువనగిరి బస్ స్టేషన్ లో తగినన్ని సీసీ కెమెరాలు, పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసి దొంగల బారినుండి ప్రయాణికులను రక్షించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. భువనగిరి బస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రైవేటు వాహనాలు, ముఖ్యంగా ఆటోలు లోనికి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

VijayaKumar

May 14 2024, 14:10

భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన


యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు. సురేపల్లి తండా సర్పంచ్ (కుమారుడు) కేతావత్ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో తరలిన గిరిజన రైతులు. రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలనీ కోరారు.

VijayaKumar

May 14 2024, 11:31

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి lచామల కిరణ్ కుమార్ రెడ్డి , పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జరిగిన పోలింగ్ తర్వాత భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవిఎం బాక్స్ లను భువనగిరి లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంగళవారం భద్రత మద్యన ఉన్న స్ర్టాంగ్ రూములను పరిశీలించారు . ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్, స్పోక్స్ పర్సన్ వచన కుమార్ తదితరులు వారి వెంట ఉన్నారు.

VijayaKumar

May 13 2024, 20:40

గోపరాజుపల్లి లో 79 శాతం పోలింగ్ నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 79 శాతం పోలింగ్ నమోదయింది. గ్రామంలో ఉన్న 788 ఓట్లకు 626 ఓట్లు పోలయ్యాయని గ్రామపంచాయతీ సెక్రటరీ ఎం లక్ష్మీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ వనం జనార్దన్, ఆశా వర్కర్ నీలం నీరజ, షేక్ జహంగీర్  జూనియర్ లైన్మెన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 13 2024, 17:51

భువనగిరి: పోలింగ్ బూత్ 65 ,91 లలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు, ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

దేశ వ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ భువనగిరి నియోజకవర్గం పట్టణ పరిధిలోని 65 , 91 బూత్ నెంబర్లలో పట్టణ 8 వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు మరియు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పోలింగ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు భారీగా భద్రతను మోహరించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానిక 8వ వార్డు జంఖాన్నగూడెం , రామ్ నగర్ , సీతానగర్ లలో ఓటర్లు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత మందులను ఓఆర్ఎస్ ప్యాకెట్లను , మంచినీటి సదుపాయాన్ని పోలింగ్ బూత్ ల వద్ద ఏర్పాటు చేశారు. ఓటర్లు క్యూ పద్ధతిలో నిలబడి నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఓటర్లకు , పోలింగ్ సిబ్బందికి , పోలీసులకు , మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగరెక్క స్వామి , కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయన సబిత గోపాల్ , డాక్టర్లు సాయి పవన్ , ఎ యన్ యం టి. ప్రేమలత , ఇంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.

VijayaKumar

May 13 2024, 15:48

వలిగొండ మండల పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రాచకొండ సిపి తరుణ్ జోషి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి సందర్శించారు .వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 250, 252 ,255,256 పోలింగ్ బూత్ లను మరియు టేకుల సోమవారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 213 ,214 పోలింగ్ బూత్ లను సందర్శించారు . పోలింగ్ సరళిని పరిశీలించి, పోలీసులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, వలిగొండ ఎస్సై డి మహేందర్, పోలీసులు ,తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 13 2024, 12:39

వేములకొండ లో ఓటు హక్కు వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న జై స్వరాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి నరేంద్ర వేముల. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అప్రాజ్యసమితంగా జరుగుతున్నాయని అన్నారు. పది రోజుల నుండి ఓటర్లకు మద్యం ,డబ్బులు పంపిణీ చేసినారని అన్నారు. సి విజిల్ యాప్ సరిగా పనిచేయలేదని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతామని తెలియజేశారు.

VijayaKumar

May 13 2024, 12:29

వలిగొండ లో ఓటు హక్కు వినియోగించుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కుటుంబ సమేతంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు ద్వారానే మనం మార్పును కోరుకోవాలని అన్నారు. ఓటు ద్వారా ప్రజలు అభిప్రాయాలను తెలిపారని అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. వాతావరణం మంచిగా ఉందని అన్నారు సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంటుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం 6టీలను అమలు చేస్తుందని తెలిపారు ఓటింగ్ శాతం పెరగాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

VijayaKumar

May 13 2024, 11:38

ఈవీఎం మిషిన్లు సిరియల్ ప్రకారం పెట్టలేదని యాదాద్రి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తుంగతుర్తి, నకరేకల్ నియోజకవర్గం పలు పోలింగ్ బూత్ లను పరిశీలించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవీఎం మిషన్ లను సీరియల్ ప్రకారం పెట్టలేదని, కావాలని ఇలా చేశారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈవీఎం మిషన్లు వరుస క్రమంలో పెట్టకపోవడం మూలంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆయన తెలిపారు వెంటనే ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించారని వారు కోరారు.