ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
![]()
ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.
భువనగిరి దీప్తి హోటల్ లో జరిగిన పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల లోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను గుర్తించింది అని అన్నారు.
రాబాయే రోజులలో ఆర్యవైశ్యులకు పెద్ద బిడ్డ వేస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకోలేదు
కెసిఆర్ నియంత పాలన ప్రజలు తరిమి కొట్టారు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పాలనను తరిమికొట్టాలి.
మోడీ ప్రధానమంత్రి అనే స్థాయిని మర్చిపోయి గుజరాత్ మోడల్ అని మోడీ గుజరాత్ కి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నాడు
సామాన్య ప్రజల సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి వ్యక్తి కాబట్టి
ఆర్యవైశ్య సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సంఘానికి రావలసిన పదవులు తీసుకోచ్చే బాధ్యత నేను తీసుకుంటాను
ఈ నెల 13 న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమర వాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, సీనియర్ నాయకులు పిసిసి నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, బాల లక్ష్మి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గస్థాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా, బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, తద్వారా బిజెపిని ఎదుర్కొనవచ్చు అని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఐ మండలాల కౌన్సిల్ సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ ...కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ పోరాటం ఉంటుందని, వారికి నష్టం కలిగించే ఏ పార్టీ అయినా ఓడించడానికి ,ఓడించే సత్తా కలిగిన పార్టీతో కలిసి పని చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గోలనుకొండ, శారజీపేట గ్రామల్లో చేయి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిచాలని కోరుతూ వారికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రచారం నిర్వహించారు.


ప్రజల మనిషి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని భువనగిరి మండలం హనుమాపురం శుక్రవారం సాయంత్రం శనివారం ఉదయం ఎండి జాంగిర్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ హాజరై మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి హనుమపురం నుండి అనంతరం రోడ్డు గుంతలమయమయి రాకపోకలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అదేవిధంగా గ్రామపంచాయతీ బిల్లింగ్ పెండింగ్ లో ఉన్నది కురుమ గూడెం నుండి మన్నె వారు పంపు పోయే రోడ్డును గుంతల మయమయి అయింది గ్రామాల ప్రజలకు రైతులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా హన్మపురం నుండి బసాపురం వరకు మెటల్ రోడ్డు కొత్తగా వేయాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి పనులు ప్రారంభించాలని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం గ్రామ శాఖ తరపున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య సిపిఎం హనుమపురం గ్రామ శాఖ కార్యదర్శి 10 ఎల్లయ్య సాయి కార్యదర్శి బండి శీను కొండాపురం యాదయ్య రాగాల రాజేశ్వరి దయ్యాల మల్లేష్ తోటకూరి గణేష్ బాధ మల్లయ్య వడ్డెబోయిన వెంకటేష్ ప్రమోదు శంకర్ తదితరులు పాల్గొన్నారు.




May 05 2024, 17:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k