అవకాశవాద పార్టీలను ఓడించండి ,సిపిఎం ను ఆదరించి జహంగీర్ ని గెలిపించండి :దయ్యాల నరసింహ భువనగిరి సిపిఎం మండల కార్యదర్శి
![]()
మతోన్మాద బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు.
ఈరోజు మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ కేంద్రాల్లో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా Md. జహంగీర్ పోటీ చేస్తున్నారని వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు బ్యాలెట్ లో వరుస సంఖ్య 5 పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.
గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం వలన వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేకమంది ప్రాణాలను కోల్పోయారని తెలిపారు .అంతేకాకుండా వామపక్ష పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టంలోని కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికులకు ప్లేస్ స్లిప్పులు, మెడికల్ కిట్టు, టెంటు, త్రాగునీరు, పనిముట్లను కార్మికులకు తగ్గించారన్నారు. ఉపాధి హామీ కూలి రేటు రూ. 600 కు పెంచాలని సిపిఎం గా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీల కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి కుల మతాలను ప్రేరేపిస్తూ ప్రసంగించడంతోపాటు ప్రజల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అందుకే బీజేపీ ని అవకాశవాద పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి గత 35 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపిన ప్రజా పోరాటాల నాయకుడు నిస్వార్థ నాయకుడు ఎండి జహంగీర్ గారిని గెలిపించి పోరాడే వారికే ఆయుధం ఇవ్వాలని నరసింహ పిలుపునిచ్చారు
*ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, తుక్కాపూర్ శాఖ కార్యదర్శి గుండెనబోయిన దానయ్య, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ పనికి ఆహార పథకం దగ్గర దాదాపు 200 మంది మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కుల మతాలు లేని సమ సమాజం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు ఈ దేశం కోసం శ్రీమతి ఇందిరా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వలిగొండ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి వద్ద టు వీలర్ లో సరైన ఆధారాలు లేని రూ. 1,66,000 నగదును పట్టుకున్నారు. ఈ నగదును సీజ్ చేసి డిటిఓ యాదాద్రి భువనగిరి జిల్లా యందు డిపాజిట్ చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.



May 03 2024, 17:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k