పదవ తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు
తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, 25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను, బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు. ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వలిగొండ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి వద్ద టు వీలర్ లో సరైన ఆధారాలు లేని రూ. 1,66,000 నగదును పట్టుకున్నారు. ఈ నగదును సీజ్ చేసి డిటిఓ యాదాద్రి భువనగిరి జిల్లా యందు డిపాజిట్ చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.





భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

May 03 2024, 17:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.7k