మోడీ, అమిత్ షా తాటాకు చప్పుల్లకు రేవంత్ రెడ్డి భయపడడు: అతహర్
![]()
ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఢిల్లీ కు రావాలని నోటీసులు ఇవ్వడం పై కాంగ్రెస్ నాయకులు అతహర్ మండిపడ్డారు. ఈ సందర్బంగా అతహర్ మీడియా తో మాట్లాడుతూ మొన్నటి వరకు అమిత్ షా, మోడీ లు ఈడి, సిబిఐ లతో ముఖ్యమంత్రులను బయపెట్టాలని చూశారని నేడు ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నోటీసులు ఇస్తే ఇక్కడ భయపడే వారు ఎవ్వరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు ఇక కేవలం నెల రోజులు మాత్రమేనని జూన్ 4 వ తేది రోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ లో బిఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రం లో బీజేపీ కి పట్టడం ఖాయం అని అన్నారు. సెమిఫైనల్ లో కెసిఆర్ ను ఓడించి గద్దె దించింది కాంగ్రెస్ పార్టీ అని ఫైనల్ లో మోడీ ని కూడా గద్దె దించేది కూడా కాంగ్రెస్ పార్టీ నే అని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమికి ఎదురు గాలి వీస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పడం తో మోడీ, అమిత్ షా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ గెలవడం ఖాయం అని తెలిపారు.






భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.







May 02 2024, 15:08
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.0k