నాటి అమరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై పోరాడుదాం :సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నాటి అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఐక్యంగా కార్మికులు, కర్షకులు , ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, కృష్ణాపురం, పెంచికల్ పహాడ్, హన్మాపురం, వడపర్తి, నందనం, నమాతుపల్లి గ్రామాలలో మేడే సందర్భంగా ఆయా గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేసినారు.ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ అనేకమంది కార్మికులు కర్షకులు సమస్త ప్రజలు తమ హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం సమరశీల పోరాటాలు నడిపి తమ ప్రాణాలర్పించి తమ హక్కులను సాధించుకున్న రోజే మేడే అని ఈ మేడే స్ఫూర్తితో భారత దేశంలో పరిపాలన చేస్తున్న మతోన్మాద బీజేపీ ఆనాటి కార్మిక హక్కులను చట్టాలను కాలరాయాలను చూస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నా. బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని వర్గాల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడ్డి దారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ వారికి ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. మరోపక్క ప్రజల పైన అనేక భారాలు మోపుతూ కులం పేరుతో మతం పేరుతో విభజన చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఇలాంటి దుర్మార్గము బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధమై ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి వామపక్షాలను, ప్రజాతంత్ర వాదుల గెలిపించాలని, భువనగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, అన్నంపట్ల కృష్ణ, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, పాండాల మైసయ్య,మోటే ఎల్లయ్య , ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ఆయా గ్రామాలకు సంబంధించిన శాఖా కార్యదర్శులు పార్టీ సభ్యులు కూకుట్ల కృష్ణ, ఉడత విష్ణు, మధ్యపురం బాల్ నరసింహ, ఉడత వెంకటేష్, మచ్చ భాస్కర్, ఎంఏ. రహిమాన్, ముదిగొండ కృష్ణ, కాసారం మల్లయ్య, సుబ్బురు పోశయ్య తదితరులు పాల్గొన్నారు.
![]()




భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.







భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


May 01 2024, 19:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.0k