అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి: బీఎస్పీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బెందర్
![]()
బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయితరాజు అబ్బేందర్ భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,తనను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే భువనగిరి పార్లమెంట్ ను ఈదేశంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని,సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్,చిట్యాల ఐలమ్మ,దొడ్డి కొమరయ్య,బెల్లి లలిత స్ఫూర్తితో రాజకీయల్లోకి వచ్చానని,నిరుద్యోగ సమస్యలు,కాలుష్యం కోరల్లో నియోజకవర్గం కొట్టుమీట్టుడుతుందని,అన్ని రంగాల్లో వెనకబాటుకు గత పాలకులు కారణం అయ్యారని,కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి అధికారం ఇస్తే రాజ్యాంగాన్ని మార్చి,మనువాదాన్ని అమలు చేస్తారని ప్రజలు ఆలోచించాలని కోరారు,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయడంలో విఫలం అయ్యారని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారాలని డిమాండ్ చేశారు,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అత్యుత్తమ పాలనను అందించారని,తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కనకుంట్ల పాండు, జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్,జిల్లా కోశాధికారి కొరబోయిన పాండు,ఆలేరు నియోజకవర్గం ఇంచార్జి గంధమల్ల లింగస్వామి,భువనగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బర్రె నగేష్,జిల్లా మహిళా నాయకురాలు బాకారం లావణ్య,సోషల్ మీడియా కన్వీనర్ చుక్క సుమన్, పోచంపల్లి మండల అధ్యక్షులు మీసాల సైదులు,తదితరులు పాల్గొన్నారు.


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం అరూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ,ఉపాధికూలీలను కలసి బూర నర్సయ్య కు ఓటు వేయాలని ,కూలీలతో మోడీ సంక్షేమ పథకాల గురించి చర్చించి ఓటు అభ్యార్ధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీఎన్ రెడ్డి , పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి , మండలాధ్యక్షుడు సుదర్శన్ మరియు దంతూరి సత్తయ్య రాచ కొండ కృష్ణ , మందుల లక్ష్మీ , మండల ప్రధాన కార్యదర్శులు లోడే లింగస్వామి గౌడ్, గంగాధర్ దయాకర్, రంజిత్ రెడ్డి, వెలిమినేటి వెంకటేశం, కొత్త రామచంద్రం,పొలు నాగయ్య,బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.







భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



May 01 2024, 18:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k