పది ఫలితాలలో పవిత్రాత్మ విద్యార్థుల ప్రభంజనం, 10 GPA సాధించిన పొట్టి పల్లి గీతిక
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పొట్టిపల్లి గీతిక పదికి పది పాయింట్లు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం నిలిచి పాఠశాల ఘనతను చాటి చూపించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జయంతి మాట్లాడుతూ కష్టపడి చదివితే వారికి ఫలితం ఎక్కడ పోదని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేస్తూ పాఠశాల కీర్తిని చాటినందులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, గీతిక తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు పాండు, బాల శౌరి ,వెంకటేశం, మిల్క్ రాజ్, ఉమాదేవి, పద్మ ,సుందరి, కల్పన తదితరులు పాల్గొన్నారు.
![]()







భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా లోతుకుంట గ్రామంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కస్తూరి మాధురి గారు హాజరైనారు ఈ సందర్భంగా ఇంటింటి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని బూర నరసయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారిని కలవడం జరిగింది బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించాలని వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిఎన్ రెడ్డి , పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,జిల్లా కార్య వర్గ సభ్యులు పాక పుల్లయ్య బచ్చు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ లోడి లింగస్వామి,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కాకుల మాధవి, రంగా రేఖ, మహిళా మోర్చ కార్యదర్శి మందుల లక్ష్మి , బూరుగు లాస్య, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానిస గౌడ్ , మండల ఉపాధ్యక్షులు డోగిపర్తి సంతోష్, దయ్యాల వెంకటేష్,మండల కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ , మండల కార్యదర్శులు మైసూర్లో మచ్చగిరి మండల నాగరాజు,BJYM జిల్లా నాయకులు రేగురి అమరేందర్ , ఓబీసీ మోర్చా మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేశం,BJYM మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,దంతురి అరుణ్,మహేష్, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.





యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

Apr 30 2024, 19:08
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
31.0k