పొద్దుటూరు లో సిపిఎం ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య
![]()
సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ గారి ఎన్నికల ప్రచార వాహనాన్ని ఈరోజు పొద్దుటూరు గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార వాహనం పొద్దుటూరులో ప్రారంభమై ఏదులగూడెం,టేకుల సోమారం,రెడ్ల రేపాక,దాసిరెడ్డిగూడం,వలిగొండ,నాగారం,నెమలి కాలువ,గోల్నేపల్లి,జాలుకాలువ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండలకార్యదర్శివర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, కల్కురి రామచందర్,కూర శ్రీనివాస్,మండల కమిటి సభ్యులు మాజీ సర్పంచ్ ఏలే కృష్ణ, కవిడే సురేష్,వలిగొండ పట్టణ కార్యదర్శి గార్దసు నర్సింహ,సింగిల్ విండో మాజీ డైరక్టర్ పలుసం బాలయ్య,శాఖ కార్యదర్శి పలుసం లింగం,పిఎన్ఎం జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు గంటేపాక శివ,ఈర్లపల్లి ముత్యాలు,నాయకులు వేముల నాగరాజు,ఆకుల రాజు,పరమేష్,వేముల జ్యోతి బస్,నాయకులు గడ్డం సుదర్శన్,పెద్దబోయిన శివశంకర్,తదితరులు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, సోమనబోయిన సతీష్ కుల నరసింహ, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




Apr 29 2024, 21:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.8k