ప్రజల పక్షాన పోరాడే ఎండి జహంగీర్ ని గెలిపించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
అవకాశవాద బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించండి
-- ప్రజల పక్షాన పోరాడే యండి. జహంగీర్ ని గెలిపించండి*
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వారికి సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపు
పూట కొక్క పార్టీలు మార్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు వస్తున్న బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించి ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థి యండి. జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని సిపిఎం కార్యాలయంలో గ్రామ జనరల్ బాడీ సమావేశం ఏదునూరి మల్లేష్ అధ్యక్షతన సమావేశం జరుగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ గత పది సంవత్సరాల మోడీ బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబాటు గురైందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మొదలుకొని అన్ని రంగాలను బిజెపి సమూలంగా మార్చి తన మతోన్మాద మనువాద ఎజెండాను అమలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాలను మార్చి పనిభారాలను పెంచిందని, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు తన అన్యాయులైన అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి నల్ల చట్టాలు తెస్తే దేశవ్యాప్తంగా రైతాంగము వారి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటుతో వెనుక కొట్టిన పరిస్థితి ఉన్నదని అన్నారు. ఇప్పటికే కీలక రంగాలైన రైల్వే ఎల్ఐసి పోస్టల్ టెలికం సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానించి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని బిజెపి ఆలోచన చేస్తుందని విమర్శించారు. మరోపక్క విపరీతమైన ధరలు పెంచి సామాన్య మానవులు నిత్యవసర వస్తువులను కొనితిని పరిస్థితుల్లో లేకుండా పోయిందని అన్నారు. విద్య వైద్యం ఉపాధి సంక్షేమం లాంటి విషయాలలో బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. బిజెపి మరో మారు గెలిస్తే ఈ దేశంలో కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు బతికే పరిస్థితి ఉండదని, రాజ్యాంగం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం హరించబడతాయని అన్నారు ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి సిపిఎం ను ఈ పార్లమెంటులో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనియాలని భాస్కర్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచి బొల్లెపల్లి కుమార్ పాల్గొని మాట్లాడగా. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లావుడియా రాజు, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, ఏరియా కార్యదర్శులు ఎద్దులూరి వెంకటేష్, ముచ్చపతి బాలయ్య , నాయకులు యండి.జహంగీర్, కడారి కృష్ణ, షాపోద్దీన్, బొల్లెపల్లి పరమేష్, పిట్టల బాలరాజు, నరసింహ, వెంకటస్వామి, మహేందర్, స్వామి, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.
![]()

అవకాశవాద బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించండి









ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Apr 28 2024, 19:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.7k